Friday, September 20, 2024
HomeతెలంగాణSathupalli: జూన్ 21 లోగా వీఆర్ఏలకు తీపి కబురు

Sathupalli: జూన్ 21 లోగా వీఆర్ఏలకు తీపి కబురు

వేంసూరు మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కులు, తన సొంత ఖర్చులతో పేదింటి ఆడపడుచులకు చీరలు పంపిణీ కార్యక్రమం శాసన సభ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ వీఆర్ఏలకు జూన్ 21 లోగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. వేంసూరు సహకార సంఘం ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేపట్టి,అనంతరం మండల కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి తన సొంత ఖర్చులతో పేదింటి ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చి రొట్ట విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. భూసారాన్ని పెంపొందించుకొనేందుకు పచ్చిరొట్ట విత్తనాలు రైతులు కు ఎంతగానో ఉపయోగపడతాయని, సేంద్రియ ఎరువులనే వాడాలని, రసాయనిక ఎరువులు విరివిగా వాడిభూమిని పాడుచేయవద్దని రైతులకు సూచించారు. తెలంగాణా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, ఎన్ని అవరోదాలు ఎదురైనా రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ధీమా వ్యక్తం చేశారు. వేంసూరు మండలంలో 150 కోట్ల రూపాయలకు పైగా ఆరు నెలల కాలంలో అభివృద్ధి నిర్వహించినట్లు పేర్కొన్నారు. జూన్ 2 వ తేదీ 23వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ ప్రభుత్వ ఆవశ్యకతను విస్తృతం చేసే విధంగా వివరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కార్యకర్తలే ప్రచార సాధనాలుగా పనిచేసి ప్రజలకు వివరించాలని కోరారు.సొంత స్థలాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకొనేందుకు లబ్ధిదారుల సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి,జడ్ పి టి సి. సభ్యులు సుమలత సురేష్,గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వాసు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, జిల్లా టెలిఫోన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మిరియాల ప్రసాద్, సర్పంచ్ ఫైజుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు నాయుడు వెంకటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు రహీం, తహసిల్దార్ నారాయణమూర్తి, ఎంపీడీవో రమేష్, మండల పంచాయతీ అధికారి రంజిత్ కుమార్, సర్పంచులు, యం పి టి సి. సభ్యులు,సొసైటి అధ్యక్షులు, డైరెక్టర్ లు, వార్డ్ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, లబ్ధిదారులు,బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.యస్సి సెల్ అధ్యక్షులు రావూరి శ్రీను, ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వర రావు టెలీకం మిరియాల ప్రసాద్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News