Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Purnima Devi Barman: హర్‌గిలాల నేస్తం ఈ పూర్ణిమా

Purnima Devi Barman: హర్‌గిలాల నేస్తం ఈ పూర్ణిమా

హర్‌గిలాల ప్రియ నేస్తం పూర్ణిమా దేవి బర్మన్‌.. అదృశ్యమై పోతున్న ఈ కొంగజాతి పక్షులకు తిరిగి ప్రాణం పోస్తున్న పర్యావరణ పరిరక్షకురాలు. హర్‌గిలాలకు, పర్యావరణానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం తన ప్రజలకే కాదు యావత్‌ ప్రపంచానికి ఆమె చాటిచెప్పారు. అందుకే ఆమెకు యుఎన్‌ఇపి వారి ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డు కైవసం వచ్చింది. ఆ విశేషాలు…

- Advertisement -

పూర్ణిమా దేవి బర్మన్‌ వన్యమృగ ప్రాణుల సంరక్షణకు కృషిచేస్తున్న బయాలజిస్టు. ఈ ఏడాది ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డు వచ్చిన ఐదుగురిలో అస్సాంకు చెందిన పూర్ణిమ ఒకరు. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యుఎన్‌ఇపి) ఈ అవార్డును నవంబరు 22న ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణలో అనూహ్య పాత్ర పోషించిన వ్యక్తులకు, ఎంతో ప్రభావాన్ని, మార్పులను తీసుకువచ్చిన సంస్థలకు యుఎన్‌ఇపి ఈ అవార్డును ఇస్తుంది. ఆ గౌరవం ఈసారి పూర్ణిమను కూడా వరించడం ఆనందించాల్సిన విషయం. పూర్ణిమదేవి బర్మన్‌ అస్సాంలోని స్థానిక కమ్యూనిటీతో ముఖ్యంగా మహిళలతో కలిసి పూర్తిగా కనుమరుగయిపోతున్న హర్‌గిలాలని పిలిచే స్థానిక కొంగ జాతిపక్షుల పరిరక్షణ కోసం దశాబ్దకాలంగా పనిచేస్తున్నారు. చిత్తడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో ఈ పక్షులు ఉంటాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ పక్షులు ఉండే ప్రాంతాల్లోని స్థానిక వన్యప్రాణులు నశించిపోతుండడంతోపాటు, అక్కడ చెట్లు కొట్టేయడం వల్ల ఈ పక్షి జాతి అంతరించిపోతోంది. దీనిపై పూర్ణిమా దేవి బర్మన్‌ బృందం చేస్తున్న విశేష కృషికిగాను ఈ అవార్డు వచ్చింది. ఇది తమ బృందానికి దక్కిన అపురూపమైన గౌరవంగా బర్మన్‌ వ్యాఖ్యానించారు.

ఈ అవార్డు కోసం యుఎన్‌ఇపికి ప్రపంచం మొత్తం నుంచి 2,200 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లోంచి బర్మన్‌ ఎంపికయ్యారు. అలా ఈ అవార్డు దక్కించుకఁనశీ ఐదుగురిలో బర్మన్‌ ఒకరిగా నిలిచారు. ఎంటర్‌ప్రెన్యూరియల్‌ విజన్‌ కేటగిరీ కింద ఈ ఏడాది బర్మన్‌కు ఈ అవార్డు దక్కింది. అస్సామీయులు హర్‌గిలా అని పిలిచే కొంగజాతి పక్షుల సంరక్షణకై బర్మన్‌ అపూర్వ కృషిచేస్తున్నారు. అదే ఆమెను ఈ అవార్డు పొందేలా చేసింది. హర్‌గిలాలు ఐదు పాదాలున్న పొడవైన కొంగజాతి పక్షులు. ఆగ్నేయాసిలోని చిత్తడి ప్రాంతాలలో కొన్ని చోట్ల ఇవి కనిపిస్తాయి. ఇండియా, కంబోడియాల్లో కూడా ఈ పక్షులను చూస్తాం. 2016 సంవత్సరం ఐయుసిఎన్‌ రెడ్‌లిస్ట్‌ ప్రకారం అదృశ్యమైపోతున్న పక్షి జాతుల్లో ఈ కొంగలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ హర్‌గిలాలు కేవలం 1,200 మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తునశీ విషయం. మనదేశంలో హర్‌ గిలాలు బీహార్‌, అస్సాంలలో కనిపిస్తాయి. అస్సాంలో ఇవి అధికంగా ఉన్నాయని బర్మన్‌ తెలిపారు.

గౌహతిలోని అరణ్యక్‌ అనే స్వచ్ఛంద సంస్థలోని అవిఫనా రీసెర్చ్‌ అండ్‌ కన్సర్వేషన్‌ డివిజన్‌లో సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌గా పూర్ణిమాదేవి బర్మన్‌ సేవలందిస్తునాశీరు. స్థానిక కమ్యూనిటీ తోడ్పాటుతో ఈ పక్షుల పరిరక్షణా కార్యాక్రమానికి 2007లో పూర్ణిమ ప్రారంభించారు. పెద్ద పెద్ద చెట్ల మీద హర్‌గిలాలు గూళ్లు పెట్టుకుంటాయి. అవి గూళ్లు పెట్టుకుంటున్న పెద్ద పెద్ద చెట్లను స్థానికులు కొట్టివేస్తుండడం పూర్ణిమను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆ కొంగలు పెట్టిన పిల్లలు కిందపడి చఁపోయేవి. అయినా స్థానికులు పట్టించుకోకుండా ఆ చెట్లను కొట్టి దుంగలను తీసుకుపోతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ పక్షుల విసర్జనలు చెట్ల కింద నేలపై పడి తీవ్ర దుర్వాసన పరిసరాల్లో బాగా వ్యాపించేది. ఆ దుర్వాసనను స్థానికులు భరించలేకపోయేవారు. కానీ హర్‌గిలాలు చిత్తడి ప్రాంత ఎకోసిస్టమ్‌ కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం బర్మన్‌కు తెలుసు. అందుకే అవి కనుమరుగవడం పట్ల తీవ్ర ఆందోళనకు ఆమె గురయ్యారు. అందుకే ఆ పక్షులను ఎలాగైనా రక్షించాలని బర్మన్‌ కంకణం కట్టుకున్నారు. ఈ కొంగలు ఎకోసిస్టమ్స్‌ను పరిశభ్రం చేస్తాయి. ఆహార చెయిన్‌లో కూడా కీలకంగా వఁవహరిస్తాయి. న్యూట్రియంట్‌ సైక్లింగ్‌తో పాటు ఎకోసిస్టమ్‌ రెగ్యులేషన్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.

హర్‌గిలా పక్షుల వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి స్థానిక ప్రజల్లో అవగాహన పెంచడానికి పూర్ణిమ పూనుకున్నారు. ఎకోసిస్టమ్స్‌ పరిరక్షణలో ఈ పక్షులు పోషిస్తున్న పాత్రను అందరికీ తెలియజేయాలనుకన్నారు. అందుకోసం ముఖ్యంగా స్థానిక మహిళలను బర్మన్‌ కూడగట్టారు. ఆ పక్షులు పర్యావరణ పరిరక్షణలో పోషిస్తున్న ముఖ్యపాత్రను స్థానిక పజ్రలకు తెలిసేలా ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆ సమయంలోనే స్త్రీలు ఈ ప్రచారంలో పాలుపంచుకోకపోవడానిశీ గమఁంచారు. ఈనేపథ్యంలో ఒకసారి స్థానికంగా ఒక పాప బేబీషవర్‌ కార్యక్రమానికి బర్మన్‌ వెళ్లినపుడు గర్భిణీలు, చెట్లపై గూళ్లు పెట్టే హర్‌గిలా పక్షుల మధ్య ఉన్న సున్నితమైన ‘మదర్‌’ లింకును గుర్తించారు. అంతే అప్పటి నుంచి ఆమె హర్‌గిలా పక్షులకు కూడా బేబీషవర్‌ కారఁక్రమం చేయడం మొదలెట్టారు. పక్షుల మాతృత్వం మానవాళికే మాతృత్వం అని ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల్లోకి సందేశం పంపారు. అలా ప్రతి ఇంటి నుంచి, ప్రతి తల్లి నుంచి తన ఈ ప్రచార కార్యక్రమం మొదలెట్టారు. విద్య, అవగాహనలు ఇంటి నుంచి, తల్లుల నుంచే ప్రారంభమవుతాయని బర్మన్‌ అంటారు. ఈ దిశగా తన హర్‌గిలాల పరిరక్షణా ప్రచార కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళలు ముందుకువచ్చి పాలుపంచుకోవాల్సిన అవసరానికి కూడా బర్మన్‌ గుర్తించారు. అలా స్థానిక మహిళలు హర్‌గిలాల పరిరక్షణలో మెల్లగా పాలుపంచుకోవడం మొదలెట్టారు. అంతేకాదు ఈ సందేశాన్ని అందరిలోకి తీసుకువెళ్లడానికి ఒక బృందంగా ఏర్పడ్డారు. అలా హర్‌గిలా ఆర్మీ ఏర్పడింది. ప్రస్తుతం ఇందులో పదివేలమంది పైగా ఉన్నారు. వీరంతా హర్‌గిలా పక్షులు పర్యావరణానికి చేస్తున్న ఉపకారాన్ని అందరికీ తెలియజేస్తూ అందరిలో అవగాహన పెంచుతున్నారు. ఈ కొంగ జాతి పక్షులను పరిరక్షించాల్సిన అవసరాన్ని స్థానికులకు విడమరచి చెపుతున్నారు. అంతేకాదు తమ ప్రతి సంస్కృతిలో, పండుగలు, పబ్బాల్లో హర్‌గిలాలను చేర్చి వాటిని తమ సంస్కృతిక సంపదలో భాగం చేయడం మొదలెట్టారు. స్థానిక జానపదగేయాల్లో కూడా ఈ పక్షి గురించిన విశేషాలను చేర్చి పాటలు పాడుతున్నారు. దుర్గా పూజ ఊరేగింపుల్లో హర్‌గిలాల బొమ్మలను పెడుతునాశీరు. తమ సంప్రదాయబద్ధ నేత టవల్స్‌ అయిన గామోచాస్‌ను కూడా హర్‌గిలా పక్షుల మోటిఫ్స్‌తో నేస్తున్నారు.

హర్‌గిలాలు పిల్లలు పెట్టే తీరు, అవి గూళ్లు ఏర్పరచుకునే తీరుతెన్నులపై కూడా బర్మన్‌ దృష్టిసారించారు. అందుకోసంగా అస్సాంలోని వివిధ ప్రాంతాల్లోని వాటి గూళ్లను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న కామ్‌రూప్‌ జిల్లాలోని దాదారియా, పచారియా గ్రామాలలో గత పదిహేనేళ్ల కాలంలో 27 హర్‌గిలా గూళ్ల నుంచి ప్రస్తుతం 250 హర్‌గిలాల గూళ్లు పెరగడం చూడొచ్చు. అయితే పక్షుల పిల్లల సంఖ్య నేటికీ తక్కువగానే ఉంటోంది. దీనికి కారణం ఆ పక్షి పిల్లలు గూడు నుంచి కింద పడి చచ్చిపోవడమే. పూర్ణిమా దేవి బర్మన్‌ చేపట్టిన హర్‌గిలాల పరిరక్షణా కార్యక్రమం ఎందరో మహిళలను సాధికారులుగా చేసింది. కనుమరుగయిపోతున్న ఈ కొంగజాతి పక్షులు తిరిగి మెల్లగా ప్రాణం పోసుకుంటున్నాయంటే దీని వెనుక పూర్ణిమా దేవి చేసిన కృషి, పట్టుదలలు ఎంతో ఉన్నాయని చెప్పాలి. ఈ పక్షుల కార్యక్రమం ద్వారా ఎంతోమంది స్థ్రీలకు జీవనోపాధి కల్పించారామె. మానవాళికి, వన్యమృగాలకు మధ్య నెలకొన్న సంఘర్షణ నివారించడం అసాధ్యం కాదు కూడా బర్మన్‌ హర్‌గిలా పక్షుల పరిరక్షణా చర్యల ద్వారా నిరూపించారు. కొంగజాతిపక్షులైన హర్‌గిలాల నిలయం చిత్తడి నేలలు. ఇవి అదృశ్యం కాకుండా కాపాడుతునాశీరు కూడా బర్మన్‌. ఎకోసిస్టమ్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరానికి, వాటిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రజలకు విజయవంతంగా తెలియజెప్పగలిగారు. ఈ అవార్డు తనకు రావడంపై మాట్లాడుతూ బర్మన్‌ అనశీ మాటలను మనం మరవలేం. ‘మా మహిళలు, స్థానిక కమ్యూనిటీ, హర్‌గిలా ఆర్మీ, హర్‌గిలా పక్షులు మేమందరం ఈ అవార్డు ద్వారా గౌరవించబడ్డాము’ని పూర్ణిమా దేవి బర్మన్‌ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మాటలు హర్‌గిలా పక్షులపై ఆమెకు ఉన్న ప్రేమ, నిబద్ధతలనే కాదు తన లక్ష్యంపై ఆమెకు ఉన్న ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదలలను ప్రతిఫలిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News