Friday, September 20, 2024
HomeతెలంగాణNanpur: తెలంగాణ స్కీములు దేశానికి ఆదర్శం

Nanpur: తెలంగాణ స్కీములు దేశానికి ఆదర్శం

తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో పర్యటించి కాలనీలో ఇంటిఇంటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను, ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా సింగరేణి యాజమాన్యం, మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పట్టణ ఉపాధ్యక్షులు సంతోష్ చారి, టీబీజీకే ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, అయిత శంకర్ ఖాసీం, గట్టు శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, పెద్దపల్లి రామన్న, శెట్టి రమణ, రుకుమ్ తిరుమల్, బండారు తిరుపతి, కొండ్ర పోచయ్య, మహిళ నాయకురాలు వంగపల్లి రజిత, కొండ్ర రాధ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News