Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్' బ్రోచర్, వెబ్ సైట్ లాంచ్

Emmiganuru: ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ బ్రోచర్, వెబ్ సైట్ లాంచ్

‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ లే అవుట్ బ్రోచర్ తో పాటు వెబ్ సైట్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కూడా వైస్ చైర్మన్ ఎ భార్గవ్ తేజ్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు ఆవిష్కరించారు. స్థానిక మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ లో బనవాసి ఫారం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక మౌలిక వసతులతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మధ్యతరగతి ప్రజలు ఎలాంటి మోసాల గురికాకుండా వారికి సొంత అస్తిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఎంఐజి లేఅవుట్ తో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేసి సెంటు భూమి 2,99,000 రూపాయల కు ధర నిర్ణయించారు. కుడా అధ్వర్యంలో ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల పరిధిలో స్మార్ట్ టౌన్ షిప్ ను బనవాసి వద్ద 110 ఎకరాలతో దాదాపు 1106 ప్లాట్ లను ప్రభుత్వ లేఅవుట్ అప్రూవల్ తో సిద్దంగా చేశారు. స్థలాలను కొనే వారికి, ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా రిబేట్ సౌకర్యం ఉంటుందని, ఒకేసారి డబ్బులు చెల్లిస్తే 5 శాతం రీబెట్ ఉంటుంది.స్థలానికి సంబంధించిన మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లిస్తే సంపూర్ణ హక్కుతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఇస్తారు. దీనిని వెంటనే మరొకరికి అమ్ముకునే అవకాశం ఉంది. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి , మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు , తహశీల్దార్ జయన్న ,మండల అధ్యక్షుడు జి.కేశన్న, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపల్ కమిషనర్లు ఎన్. గంగిరెడ్డి , రఘునాథ్ రెడ్డి ,కూడా టౌన్8 ప్లానింగ్ ఆఫీసర్ విజయభాస్కర్, రాజేష్,ఎమ్మిగనూరు టిపిఓ గోపాల్ కృష్ణ, బనవాసి సర్పంచ్ నల్లారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News