Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Biodiversity: ప్రమాదపుటంచున జీవవైవిధ్యం

Biodiversity: ప్రమాదపుటంచున జీవవైవిధ్యం

ప్రకృతిలో మనిషితో పాటు కోటానుకోట్ల జీవరాశులు న్నాయి. మనిషి ఒక్కడే కాదు ప్రకృతిలో ప్రతి జీవికి ప్రాధాన్యం ఉంది. సృష్టిలోని సమస్త జీవరాశులు ప్రకృతి మీద ఆధారపడే బతుకుతున్నాయి. జీవవైవిధ్యం అనేది ప్రకృతి అందిం చిన సంపద. జీవవైవిధ్యంలో అటు వృక్ష జాతులతో పాటు ఇటు జంతుజాతులకు సమాన ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం కూడా ఉంది. దాదాపు 45 వేల వృక్ష జాతులు, 77 వేల జంతుజాతులు మనదేశంలో ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ఆ జీవ సంపదలో 10 శాతా నికి పైగా ఇవాళ ప్రమాదంలో పడింది. ఈ జీవజాతుల్లో చాలా వరకు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కొన్నేళ్లుగా ఈ జాతుల అంతరించిపోయే కార్యక్రమం జోరందుకుంది.
రసాయనిక ఎరువులతో ప్రమాదం
వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు పెరిగిన ప్రాధాన్యం జీవజాతులకు ప్రమాదంగా మారింది.రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడిన ప్రభావం జీవజాతులపై పడింది. దీంతో ఎం తో విలువైన జీవసంపదను మనం కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ ఓ విశేషాన్ని ప్రస్తావించుకుని తీరాలి. మన దేశంలో ఆదివాసులు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో అక్కడ జీవవైవిధ్యం పదిలంగా ఉంది. మన దేశంలో దాదాపు ఆరు కోట్ల మంది ఆదివాసీలు నివసి స్తున్నారు. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ జనాభాల్లో 80 శాతానికంటే ఎక్కువమంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉన్న ఈశాన్య ప్రాంతంలో జీవవైవిధ్యం పదిలంగా ఉంది. దీనికి అడవిబిడ్డలు అవలంబించే వ్యవసాయ విధానాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆది వాసులు సహజంగా రసాయనిక ఎరువుల జోలికి వెళ్లరు. తరతరా లుగా మంచి దిగుబడినిచ్చే సహజ విత్తనాలను అడవిబిడ్డలు ఇప్పటికీ సంరక్షించుకుంటున్నారు. ఆర్నెల్లకో, ఏడాదికో అడవి బిడ్డలందరూ కలిసి జాతరలు పెట్టుకుంటారు. ఈ జాతర్లలో విత్తన మార్పిడి చేసుకుంటారు. అంతేకానీ ఏరోజూ రసాయనిక ఎరువుల జోలికి వెళ్లరు. నేలతల్లిని ఇబ్బంది పెట్టరు.
సృష్టిలో అన్ని జీవజాతులే సమానమే
సృష్టిలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉంది. సృష్టిలోని జీవ జాతుల్లో ఏ ఒక్కటీ ఎక్కువా కాదు అలాగని తక్కువా కాదు. ఏ జీవి ప్రాధాన్యం ఆ జీవిదే. ప్రకృతివరకూ అన్ని జీవజాతులూ సమా నమే. అన్ని జీవజాతులు ఒకదానిమీద మరొకటి ఆధారపడి జీవ నం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడక తప్పదు. అలాగే ప్రకృతి లేనిదే మానవ జాతికి బతుకే లేదు. వివిధ జీవుల మధ్య ఉన్న సంబంధాల కలయిక ఆహారపు గొలుసుకట్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ గొలుసుకట్టు వ్యవ స్థలో ఒక జీవికి మరో జీవి ఆహారమవుతుంది.చెరువుల్లో ఉండే కీట కాలను తిని కప్ప బతుకుతుంది. కప్పను తిని పాము జీవిస్తుంది. పామును గద్ద తింటుంది. గద్ద చనిపోయాక దానిని క్రిములు తిం టాయి. గద్దను భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఆహారపు గొలుసుకట్టు విధానం అంటే ఇదే. ఈ గొలుసుకట్టు విధానంలో అన్ని జీవులు ప్రకృతిపైనే ఆధారపడి ఉం టాయి. ప్రకృతే అన్ని జీవజాతులను నియంత్రిస్తుంది.
అంతరించిపోతున్న అనేక జీవజాతులు
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అనేక జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా అంతరించిపోయే జాబితాలో ఏనుగులు, పులులు, కొన్ని రకాల కోతులు కూడా ఉన్నాయి. గత యాభై ఏళ్లు గా అనేక రకాల వన్యప్రాణుల సంఖ్య కూడా బాగా తగ్గింది. చైనీస్‌ సాలమండర్స్‌ కూడా ఈ జాబితాలో ఉంది. సాలమండర్స్‌ మాం సం కోసం ఇటీవలి కాలంలో వేట ఎక్కువైంది. దీంతో చైనీస్‌ సాల మండర్స్‌ సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. వీటితోపాటు అంత రించిపోయే జాబితాలో మరికొన్ని జీవజాతుల పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో అమూర్‌ చిరుత ముఖ్యమైనది. అమూర్‌.. ఇదొక అరుదైన చిరుత. తూర్పు రష్యా అడవులను ఆవాసాలుగా చేసుకుని అమూర్‌ చిరుతలు బతుకుతుంటాయి. అమూర్‌ చిరుత చర్మానికి మార్కెట్‌లో డిమా్‌ండ ఉంది. దీంతో వేటగాళ్లు వీటిని ఎడాపెడా చంపేస్తున్నారు. ఈ జాబితాలో ఉన్న మరో జీవి… నల్లటి ఖడ్గమృగం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం ఐదు వేలు మాత్రమే ఉన్నాయి. వీటి కొమ్ములను అక్రమ రవాణా చేసి వేటగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ జంతువులు అంతరించి పోవడానికి కారణం కూడా వేటగాళ్లే. బోర్నియన్‌ ఒరాంగుటన్‌ …అంతరించిపోతున్న జాబితాలో ఉన్న మరో జీవి ఇది. ఆగ్నేయా సియా దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సుమత్రా ఏను గులు.. ప్రమాదపు అంచుల్లో ఉన్న జీవజాతుల్లో ఇదొకటి. బోర్నియో, సుమత్రా దీవుల్లో అడవుల నరికివేత కారణంగా సుమ త్రా ఏనుగులు అంతరిస్తున్నాయి.వీటి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1500కు మించదు. వీటితో పాటు గతంలో మనం ప్రతిరోజూ చూసే పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి. మన పెద్దవాళ్ల జ్ఞాపకాల్లో పిచ్చుకలు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు ఆకాశం వైపు చూస్తే గాల్లో ఎగిరే పిచ్చుకలు కనిపించేవి.పల్లెల్లో, పంట చేలల్లో, ధాన్యపు రాశుల చుట్టూ పిచ్చుకలు బాగా సందడి చేసేవి. ఇప్పుడు ఆ పిచ్చుకలూ లేవు అలాగే ఆ సందడీ లేదు. పిచ్చుకలు మాయమవుతున్నాయి. పరిమితికి మించిన సెల్‌ తరంగాల రేడి యేషన్‌ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నట్లు అధ్యయనా లు వెల్లడిస్తున్నాయి. పిచ్చుకలు సహజంగా మిడతలకు శత్రువులు. ప్రకృతిలో పిచ్చుకలు కనుమరుగు కావడంతో మిడతల దండు రెచ్చిపోతోంది. మానవాళిని అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక సదుపాయాలను అందు బాటులోకి మన ముంగిటకు తెస్తున్న విషయాన్ని ఎవరూ కాద నరు. అయితే మోడర్న్‌ టెక్నాలజీ మరోకోణంలో దుష్ఫలితాలకు దారితీస్తోంది. ప్రస్తుతం భూమి మీద సజీవంగా ఉన్న జీవ జాతు లు కేవలం కోటిన్నర లక్షలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక చెట్టును నరికితే ఆ ప్రభావం అనేక పక్షులు, జంతువులపై ఉంటుంది.
జీవ వైవిధ్యంలో అడవుల కీలక పాత్ర
జీవ వైవిధ్యంలో అడవులది కీలక పాత్ర. అయితే పట్టణీకరణ పెరగడంతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది.ఇది ఏ ఒక్కదేశానికో పరిమితమైన అంశం కాదు. అన్నిదేశాల్లోనూ ఉన్నదే. పట్టణీకరణ తో పాటు అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న అనేక ప్రాజె క్టులు అడవుల విస్తీర్ణం తగ్గడానికి కారణమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 13 మిలియన్‌ హెక్టార్లకు పైగా అడవులు నాశనం అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మనదేశం విష యాని కొస్తే ఇక్కడ అడవులను ఎడాపెడా నరికి వేస్తున్నారు. మన దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు విచ్చలవిడిగా అడవులను నరికి వేస్తుంటారు.మరో వైపు చెట్ల సంరక్షణ పేరుతో అక్కడక్కడా మొక్కలు నాటుతుంటారు. ఇదేం చెట్ల సంరక్షణ ఎవ రికీ అర్థం కాదు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత చాలా కా లంగా యధేచ్ఛగా సాగుతోంది. అభివృద్ధి పేరుతో ఈ విధ్వంస కాండ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది.దీంతో ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం దెబ్బ తింటోంది. అకాల వర్షాలు,వరదలు ఇవన్నీ పర్యావరణాన్ని ధ్వం సం చేస్తున్న ఫలితంగా సంభవిస్తున్న దుష్పరిణామాలే. జీవ వైవి ధ్యం దెబ్బతినడం కూడా పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణ మిస్తోంది. పర్యావరణం దెబ్బతిన్న ప్రభావం…భూతాపం పెరుగు తోంది. ఈ అన్ని కారణాలతో చివరకు 2050 నాటికి నాలుగింట ఒక వంతు జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉందంటు న్నారు సైంటిస్టులు. ఈ సృష్టిలో మనుషులు ఒక్కరే ఉండటం సాధ్యం కాదు. మనుషులతో పాటు మిగతా జీవులు కూడా ఉం డాలి. ఉండితీరాలి. అదే ప్రకృతి ధర్మం. మిగతా జీవజాతులతో పాటు మనిషి సహజీవనం చేయగలగాలి. అదే జీవవైవిధ్యం. అదే సృష్టి ధర్మం. ఈ సత్యాన్ని ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా అర్థం చేసుకోగలగాలి. ఇప్పటికైనా మనిషి తన జీవనశైలిని మార్చుకోవాలి.రసాయన ఎరువుల వాడకాన్ని పక్కన పెట్టాలి. సాధ్యమైనంతవరకు భూతాపాన్ని తగ్గించాలి. ప్రకృతిలోని ఇతర జీవజాతులను, మొక్కలను కూడా కాపాడుకోవాలి. అప్పుడే మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతాం.
-ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌
63001 74320
సీనియర్‌ జర్నలిస్ట్‌
(నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News