అమీర్‌పేట డివిజన్ పరిధిలోని శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఏప్రిల్ 24 నుంచి మే 22 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆలయ ఈఓ అన్నపూర్ణ వెల్లడించారు. నోట్లు రూ.24,54,513లు, నాణేలు రూ.95,240, అన్నదానం హుండీ రూ.50,516 మొత్తం రూ.26,00,269 ఆదాయం 25 రోజుల్లో వచ్చిందని తెలిపారు. అంతే కాకుండా అమెరికన్ డాలర్లు 4, ఖతార్ రియాధ్లు 2, అరబ్ దిరంలు 20 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సాయిబాబా గౌడ్, ట్రస్ట్ సభ్యులు ఆంజనేయులు యాదవ్, సురేష్ గౌడ్, అనిల్, సంతోష్ కుమార్, యాదగిరి,దేవాదాయ శాఖ అధికారిని శ్రీదేవి, ఎస్సార్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.