RGV : ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలతో పాపులర్ అయితే ఇప్పుడు ట్వీట్స్, కామెంట్స్, వెరైటీ సినిమాలతో పాపులర్ అవుతున్నారు డైరెక్టర్ ఆర్జీవీ. ఆర్జీవీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి అనంతరం ఏపీ రాజకీయాలపై వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు చేస్తున్నాను అని ప్రకటించడం వైరల్ అయింది. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో కూడా బాగా చర్చగా మారింది.
ప్రస్తుతం తన దర్శకత్వంలో ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ఆర్జీవీ. ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను తర్వాత తీయబోయే సినిమాల గురించి మాట్లాడాడు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. ”నేను త్వరలో వ్యూహం, శపథం అనే పొలిటికల్ సినిమాలు చేయబోతున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, చేసిన వ్యూహాల నేపథ్యంలో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఉన్నంత డ్రామా తెలంగాణ రాజకీయాల్లో లేదు. అందుకే నేను ఏపీ రాజకీయాలపై సినిమాలు చేస్తున్నాను. అంతేకాకుండా నాకు వైసీపీ, టీడీపీలలో ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే ఏపీ పాలిటిక్స్ మీద సినిమా చేస్తున్నాను” అని తెలిపారు.