సంజామల మండలం అక్కంపల్లే గ్రామంలో CGF నిధులతో 69 లక్షల రూపాయలతో శ్రీరామస్వామి ఆలయ పునర్నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరు అయ్యారు. గ్రామానికి చేరుకొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం శ్రీరామస్వామి ఆలయ పునర్నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కంపల్లే గ్రామ రైతు మిత్ర సంఘానికి రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీ పై మహేంద్ర 575 ట్రాక్టర్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం నాగేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకట కృష్ణా రెడ్డి, అన్నెపు రెడ్డి నాగిరెడ్డి, కప్పెట వెంకట్రామిరెడ్డి, దుగ్గి రెడ్డి నాగేశ్వర్ రెడ్డి, కప్పెట వెంకటేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిమాట్లాడుతూ గ్రామాల్లోనీ ప్రజలందరూ కల్సికట్టుగా గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. సిజిఎఫ్ నిధుల ద్వారా 69 లక్షల రూపాయలతో శ్రీరామస్వామి ఆలయ పునర్నిర్మానానికి ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగిందని చెప్పారు. సి.జి.ఎఫ్ నిధులు మంజూరు కావడానికి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ను దుగ్గిరెడ్డి బాల వీరారెడ్డి గారు అందించడం వల్ల నిధులుగా మంజూరయ్యి భూమి పూజ నిర్వహించుకోవడానికి ముఖ్యకారకుడైన దుగ్గిరెడ్డి బాల వీరారెడ్డిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం రైతు భరోసా కేంద్రం ద్వారా అక్కంపల్లి గ్రామం రైతు సంఘం వారికి సబ్సిడీపై ట్రాక్టర్ ను పంపిణీ చేశారు.
Sanjamala: భూమిపూజలో కాటసాని
సంబంధిత వార్తలు | RELATED ARTICLES