జైపూర్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ… స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అని అన్నారు. జిల్లా స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు పనిచేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రక్తదానం చేయడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నది అది ఒక అపోహ మాత్రమే అని, రక్త దానం చేస్తనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మోహన్ రావు, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీఓ అనిల్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్, మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ సభ్యులు, ఎంపీటీసీ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అమ్మ పౌండేసన్ యూత్ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.