నిరుద్యోగులైన యువకులకు సీసీ కెమెరాల రిపేరు, మెంటైనన్స్, సర్వీస్, ఏసి/ రిఫ్రిజిరేటర్ రిపేర్ మరియు సర్వీస్ గురించి ఉచిత శిక్షణ మరియు భోజనం వసతి కల్పించనున్నట్టు జిల్లా సీపీ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువకులకు CCTV Maintenance & Repair, ఏసి, రిఫ్రిజిరేటర్ రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ గురించి సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ మరియు యూనియన్ (RSETI) గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ లో (45) రోజులపాటు నిపుణులైన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు స్కిల్ ఇండియా ద్వారా సర్టిఫికెట్ ఇస్తారు.
శిక్షణ పూర్తయిన తర్వాత అర్హులైన ఆసక్తి గలవారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తారని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఆసక్తి, నేర్చుకోవాలని తపన ముందు భవిష్యత్తు గురించి ఆలోచించే నిరుద్యోగులైన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ పూర్తి అయిన తర్వాత ఎవరిమీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందవచ్చు ఆమె సూచించారు.
ఈ శిక్షణలో పొందడానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి
👉18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
👉విద్యార్హత: పదవ తరగతి పాస్/ఫెయిల్.
👉నేర్చుకోవాలని తపన స్వయం ఉపాధి ద్వారా మంచి భవిష్యత్తు గురించి ముందుకు వెళ్లాలని పట్టుదల ఉండాలి.
గ్రామీణ, పట్టణ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) ఆఫీసులో తేదీ: 24-05-2023 నుండి 31-05-2023 వరకు పేరు ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి, ఏమైనా సందేహాలు ఉంటే ఎస్బి ఆఫీస్ ఫోన్ నెంబర్ కు 8712667380 ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. అని తెలిపారు.