చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నివాసంలో 5, మండలాలు, 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే బాల్క సుమన్.