ఆసియా ఖండంలోనే అతి పెద్దదేశం, అభివృద్ధి చెందిన దేశం చైనా. చైనాతో స్నేహాన్ని పెంపొం దించుకోవాలని రష్యా ఉబలాట పడుతోంది. అందు నిమి త్తమే చైనాకు రష్యా ప్రధాని మైఖేల్ ఈ నెల 23, 24 వ తేదీలలో చైనాలో అధికారికంగా పర్యటించారు. ఇది నిజమేనని రష్యా ధ్రువీకరించింది. ఎన్నడు చైనా ఛాయ లకు వెళ్ళని రష్యా బీజింగ్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరియు ప్రధాని లీకాంగ్ తో పాటు ఇతర అధికారులు రష్యా ప్రధానితో భేటీ అవుతున్నారు. ఒక దేశ అధ్యక్షుడు, ప్రధానితో రష్యా ప్రధాని కలవడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. రష్యా ఏమి ఆశించి చైనాతో సమావేశములో చర్చిస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారం, రెండు దేశాల ఆర్ధిక పరిస్థితులు చర్చకు రావొచ్చు. రష్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం కనుక పారి శ్రామిక, మరియు రవణా మౌలిక వసతులు, వ్యవసాయ తదితర రంగాలలో చర్చలు ఉండొచ్చు. ముఖ్యంగా దేశాల మధ్య సహకారంపై చర్చించవచ్చు. ఎందుకంటే ఆసియా లో అతి పెద్ద దేశం చైనాయే. దక్షిణ ఆసియాలో అయితే భారత్ పెద్దది. భారత్‌తో ఎలాగు స్నేహ బంధం ఉంది, అది తెగేది కాదు. ఆసియాలో చైనా తో సంబంధాలు సహకార పద్ధతిలో మెరుగు పరచుకోవాలని రష్యా యోచన. ఇవి కాక ధ్వయి పాక్షిక ఒప్పందాలపై సంత కాలు కూడా జరగవచ్చని భోగట్ట. రెండు దేశాల ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. కాకపోతే ఉక్రైన్ తో యుద్ధం వల్ల రష్యా దెబ్బ తిన్న మాట వాస్తవం.అందుకని దెబ్బతిన్న ఆర్ధిక మూలాలపై, రవాణా, మౌలికవసతులపై రష్యా, చైనా సహకారాన్ని కొరవచ్చు. వ్యవసాయంలో చైనా అనుసరి స్తున్న పద్ధతులు తమకు అనుకూలంగా చేసుకోవాలని రష్యా యోచన. చైనా అ వలంబించే వ్యవ సాయ పద్ధతుల వల్ల మెరుగైన ఫలితాలు అ దేశంలో వచ్చిన దరిమిలా రష్యాలో కూడా చైనా తరహా వ్యవసా యం సాగు చేసి లాభాలు గడించాలని రష్యా అభిప్రా యంగా ఉంది. అయితే రష్యాలో వ్యవసాయం కన్నా పారి శ్రామిక రంగమే ముందంజలో ఉంది. కేవలం పారిశ్రా మిక రంగం పై దృష్టి పెట్టకుండ వ్యవసాయంలోను మెరుగైన పద్ధతులు అవలంభించి ప్రయోజనం పొందాలి, తద్వారా లాభాలు గడించాలని రష్యా అభిలషిస్తోంది.
ఈ తరహాలోనే చైనాతో వ్యవసాయ పద్ధతులు గురించి ఆరా తీసింది. కేవలం వ్యవసాయం పైనే కాకుం డా రవాణా పై కూడా చర్చిచ్చినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య మౌలిక వసతులు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు పెంచుకోవాలనే దృక్పదం తో రష్యా, చైనా ను కోరే సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్, అమెరికా దేశాలు రష్యాకు దూరం అయిన నేపథ్యంలో చైనా తో సంబంధాలు మెరుగు పరచుకోవాలని రష్యా ఉద్దేశంగా ఉంది. బ్రిటన్‌తో కూడా ఈ మధ్య కాలంలో రష్యా సంబంధాలు బెడిసి కొట్టాయి. ముఖ్యంగా రష్యా కు చెందిన దాదాపు 86 సంస్థలపై బ్రిటన్ ఇటీవలే ఆంక్షలు విధించింది. వీటిలో రవణా, ఆర్ధిక రంగాలు ఉండటం తో రష్యా, చైనా కు దగ్గర అయింది. ఉక్రైన్ యుద్ధం పరిష్కారం కాకపోవడంతో సైన్యానికి మద్దతు ఇచ్చే రంగాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. అందు నిమిత్తమే రష్యా, చైనా తో సంబంధాలు మెరుగు పరచుకోవాలనే యోచన లో ఉంది. రష్యా పై తీవ్ర ఒత్తిడి పెంచాలని, అ దేశంలోని కొంతమంది సంపన్నులపై మరియు కొన్ని కంపెనీల డైరెక్టర్లు పై తీవ్ర ఆంక్షలు విధించినట్లు లండన్ పేర్కొంది. వీటిని పరిగణలోనికి తీసుకుని రష్యా, చైనాతో సంబంధాలు మెరుగు పరచుకొని, ఆర్ధిక స్టిరత్వం సాదించుకోవాలని చూస్తోంది. అదే విధంగా షాంగయి లో జరిగే రష్యా, చైనా బిజినెస్ ఫోరమ్ సమావేశంలో ను రష్యా ప్రధాని మైకేల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా రష్యా, చైనాకు దగ్గర అవడం చుస్తే రెండు దేశాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళుతు ప్రపంచంలో అమెరికాను నిలువరించాల నే దృక్పదంతో ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే రష్యా, చైనా బంధం దృఢతరమే. అయితే చైనా ను ఎంతవరకీ రష్యా నమ్ముతుందో అర్ధం కాని విషయం. దానికి కారణం భారత్‌తో చైనా పంచశీల ఒప్పందం చేసుకుని దానికి విరుద్ధంగా భారత్‌తో యుద్ధం చేసిన సంగతి రష్యాకు అవగతమే. లేకపోతే ప్రస్తుత పరిస్థితులలో చైనా సహకారం అవసరమనే యోచనతోనే రష్యా ముందుకు వెళుతోంది. ఆ మిషన్‌తోనే మైఖల్, చైనాలో పర్యటించడం. రష్యా ప్రధాని మైఖల్ చైనా లో పర్యటన చేయడం భారత్ ఏమి స్పందించ లేదు. రష్యా ఎప్పటికి మా మిత్రదేశమేనని భావిస్తుంది. భారత్‌కు నష్టం కలిగించే విధంగా రష్యా ఎప్పుడూ ప్రవర్తించదు. చైనాతో సహకార సంబంధాలే రష్యా వాంఛిస్తోంది.
- కనుమ ఎల్లారెడ్డి,
పౌరశాస్త్ర అధ్యాపకులు,
93915 23027.