Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 28,486 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన

Nandyala: 28,486 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబందించి 28,486 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 23.91 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బహిరంగ వేదిక నుంచి జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 703 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జమ చేసే వర్చువల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, సంక్షేమ శాఖ డిడి చింతామణి, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మీదేవి, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు తదితరులు వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి 28,486 మంది విద్యార్థులకు సంబంధించి 25,576 మంది తల్లుల ఖాతాల్లో రూ. 23.91 కోట్లు జమ చేశామన్నారు.జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 4,718 మంది విద్యార్థుల తల్లులకు రు.3,97,40,552/-లు, బనగానపల్లిలో 5,268 మందికి రు.4,37,53,823/-లు, డోన్ లో 4,418 మందికి రు.3,57,37,041/-లు, నందికొట్కూర్ లో 3,901 మందికి రూ.3,10,66,087/-లు, నంద్యాలలో 4,956 మందికి రు.4,65,86,224/-లు, పాణ్యంలో 1453 మందికి రూ. 1,19,68,962/-లు, శ్రీశైలంలో 3,772 మందికి రు.3,02,83,086/- లు వెరసి మొత్తం 28,486 మంది విద్యార్థులకు సంబంధించి 25,576 మంది తల్లుల ఖాతాల్లో రు. 23,91,35,775/-లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ హితబోధ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు….చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందాన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, మార్క్ ఫెడ్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News