కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ఆరు మండలాల ఆర్.ఎం.పి, పిఎంపి అధ్యక్ష కార్యదర్శులతో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటూ వారికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్న ఆర్.ఎం.పి, పి ఎం పి ల సేవలు అమోఘం అని కొనియాడారు.
చొప్పదండి నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో దాదాపు 400మంది ఆర్.ఎం.పి, పి.ఎం.పిలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ప్రథమ చికిత్స అందించి తదుపరి ఆరోగ్య చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలకు పంపుతున్నారు. రాత్రి సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పాటు వారి వెంట వుంటూ చికిత్స అందే వరకు ఉంటున్నారు. దీంతో ప్రజలు గ్రామీణ వైద్యులకు ఎంతో ఆదరాభిమానాలతో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమ అనంతరం ఆరు మండలాల ఆర్.ఎం.పి, పిఎంపి అధ్యక్షులు, కార్యదర్శులు నియోజకవర్గ ఆర్.ఎం.పి, పి ఎంపి అధ్యక్షులు గా కొడిమ్యాల మండల కేంద్రముకు చెందిన పులి వెంకటేష్ గౌడ్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సుంకెనపల్లి రమేష్ ను ఎన్నుకున్నారు. ఇరువురిని జోనల్ అధ్యక్షులు దొంతుల మనోహర్ శాలువాతో సన్మానించారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సుంకనపల్లి రమేష్ మాట్లాడుతూ… మాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పి నందుకు మా వంతు బాధ్యతగా చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ సహకారం తో సంఘం అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు దొంతుల మనోహర్,ఆరు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు యాదగిరి సంపత్,వి శ్వనాథం, లక్ష్మణ్ గౌడ్, రాజేశం, మల్లేషం,చెన్నూరి గంగాధర్, మ్యాకల తిరుపతి, బిల్ల గణేష్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.