Friday, November 22, 2024
HomeతెలంగాణErrabelli: కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటా

Errabelli: కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటా

బిఆర్ ఎస్ తోనే దేశానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఏర్ప‌డుతుంది. రాష్ట్రంలాగే దేశం బాగుప‌డాలంటే, బిఆర్ ఎస్ దేశంలో అధికారంలోకి రావాలి. అందుకు మ‌న‌మంతా స‌హ‌క‌రించాలి. సిఎం కెసిఆర్ ను ఆశీర్వ‌దించాలి. దేశం మొత్తం సీఎం కెసిఆర్ కోసం ఎదురు చూస్తున్న‌ది. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప్ర‌భుత్వ‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అని మంత్రి కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. బి అర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయ‌ప‌ర్తి మండలం కొండాపురం, గ‌ట్టిక‌ల్‌, తానీశ్ తండ‌, ఊక‌ల్లు, బాలాజీ తండా, జ‌గ‌న్నాథ‌ప‌ల్లె, దుబ్బ‌తండాల‌కు క‌లిపి ఊక‌ల్లు గ్రామ శివారులో నిర్వ‌హించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ. తెలంగాణ ప‌ట్ల కేంద్ర వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రించ‌క‌పోగా, అడ్డుపుల్ల వేస్తున్న‌ది. నిధుల‌కు కోత పెట్టి, నిందిస్తున్న‌ది. న్యాయంగా తెలంగాణ‌కు రావాల్సిన నిధుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ది. ఈ వైఖ‌రి కార‌ణంగా తెలంగాణ అభివృద్ధి కుంటు ప‌డుతున్న‌ది. అయినా, సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిపారు. దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దారు. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

ఇక‌, తాను పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పాత కొత్త తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని..సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స‌మృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబార‌క్‌ పథకాలు దేశానికే ఆద‌ర్శంగా మారాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాల‌లో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు.

మరోవైపు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధి కి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు.

రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండ‌గా నిలావాల‌ని పార్టీ శ్రేణుల‌కు మంత్రి పిలుపునిచ్చారు.

మ‌హిళ‌ల‌కు వ‌డ్డిస్తూ, వారితో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌యంగా వ‌డ్డించారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి భోజ‌నాలు చేశారు.

అంత‌కుముందు ఆత్మీయ సమ్మేళ‌నంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, సిఎం సందేశం చ‌దివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News