అథ్లెటిక్స్ పై యువత దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. అందుకు అనువైన మైదానాల ఎర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కన్నారు.
చదువుతో పాటూ క్రీడా రంగంలో యువత రాణించాలని ఆయన సూచించారు.మంత్రి జగదీష్ రెడ్డి వేసవి లో యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించేందుకు గానూ సొంత నిధులతో క్రీడా పరికరాలను పంపిణీ చెయ్యడంతో పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందుకు కొనసాగింపుగా ఈ వేసవిలోనూ వివిద రకాలైన క్రీడా పరికరాలను అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ను రూపొందించారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ యువతకు క్రికెట్ కిట్లు వివిధ రకాలైన ఆటల సామాగ్రిని మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలనుండి తరలి వచ్చిన యువత తో మంత్రి జగదీష్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. మానసిక రుగ్మతలను క్రీడలతో రూపు మాపోచ్చన్నారు. మానసిక ఉల్లాసంతో పాటూ దేహ దారుఢ్యననికి క్రీడలు దోహద పడతాయన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా క్రీడా సామాగ్రిని అంద జేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడా సామగ్రి అందజేత ద్వారా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలిఅన్నదే సంకల్పమన్నారు. సంకల్పసిద్దిలో విద్యార్థి,యువత భాగస్వామ్యం అయి క్రీడలలో సూర్యాపేట ను ఒక ఐకాన్ గా నిలుపాలని మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థి, యువత కు పిలుపునిచ్చారు.