అపర భగీరతుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పాలనలో రాష్ట్రంతో పాటు మానకొండూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ ప్రజలకు వివరించారు. తొలిద్దు పర్యటనలో భాగంగా మానకొండూర్ మండలంలోని మానకొండూర్, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్డి, రంగపేట, అన్నారం, తదితర గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వేకువ జాము నుండి మధ్యాహ్నం వరకు ఆయా గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేక మవుతూ, సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Manakonduru: ‘తొలిపొద్దు’ పర్యటనలో రసమయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES