పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని మంచి ఆలోచనలతో మండల విద్యార్థినీ విద్యార్థుల కొరకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి వారి స్వగ్రామమైన వేంసూరు మండలం, కందుకూరు గ్రామంలో వారి మాతృమూర్తి బండి సోమకాంతమ్మ పేరుతో నూతన హంగులతో నిర్మిస్తున్న బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలకు ప్రభుత్వ పరమైన అనుమతులను ఇవ్వాలని హైదరాబాదులో అంబేద్కర్ సచివాలయం నందు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కోరారు.
విద్యార్థుల ఉజ్వల భవిత, భవిష్యత్తుకు పాలిటెక్నిక్ విద్య బాటలు వేస్తున్న తరుణంలో, ఇంజనీరింగ్ గా ఎదగాలన్న ప్రతి ఒక్క విద్యార్థి కోరిక తీర్చేందుకు, సాంకేతిక విద్యను ప్రభుత్వ పరంగా అందించేందుకు సత్తుపల్లిలో పాలిటెక్నిక్ కాలేజ్ ను మంజూరు చేయాలని మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వినతి పత్రాన్ని అందజేశారు.