Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Notes ban: నోట్ల రద్దు ఓ ఎత్తుగడేనా?

Notes ban: నోట్ల రద్దు ఓ ఎత్తుగడేనా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి కనువిప్పు కలిగించించాయి. అవా స్తవాలను చెప్పి ఎల్లకాలం ప్రజలను నమ్మించలేమన్న సం గతి బీజేపీ పెద్దలకు బోధపడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ ఘోర పరాజయం తరువాత అభివృద్ధి మంత్ర పేరుతో తాను చేసే మ్యాజిక్‌ పనిచేయదని ప్రధాని నరేం ద్ర మోడీ డిస్్ైడ అయినట్లున్నారు. దీంతో అమ్ములపొది నుంచి ఓ పాత ఆయుధాన్ని సరికొత్తగా బయటకు తీసిం ది కేంద్రప్రభుత్వం. ఇదే… రిజర్వు బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయం. రెండు వేల రూపాయల నోటు చలమణిని రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకోవడం. వాస్తవానికి దాదాపు ఆరేళ్ల నుంచి రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడ కనిపించడం లేదు. సామాన్యుల చేతుల్లో ఎక్కడా ఈ నోట్లు కనపడలేదు. సొమ్ములు డ్రా చేయడానికి ఏటీఎం సెంటర్‌ కు వెళ్లినా అక్కడా రెండు వేల రూపాయల నోట్లు కనిపిం చేవి కావు. ప్రస్తుతం మార్కెట్‌లో చలామణిలో ఉన్న కరెన్సీ లో రెండు వేల రూపాయల నోట్లు కేవలం 11 శాతం మాత్రమే. ఇంత తక్కువ శాతం ఉన్న రెండువేల రూపా యల నోట్లను ఉపసంహారించాల్సిన అవసరం రిజర్వు బ్యాంకుకు ఎందుకు వచ్చిందో ఒక పట్టాన అర్థంకాదు. ఇంతకీ ఎందుకు రద్దు చేశారని ఎవరైనా అమాయకంగా అడిగితే ఆర్బీఐ అధికారులు చెప్పిన మాట ఒకటే. అదే… బ్లాక్‌ మనీని వెలికితీయడం. అభివృద్ధి మంత్ర, గుజరాత్‌ మోడల్‌ , మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాలు లోపల ఎంత డొల్లగా ఉంటాయో బ్లాక్‌ మనీని వెలికితీయడం అనే మాట కూడా అంతే డొల్లగా ఉంటుంది.
2016లో ఎంత నల్లడబ్బు వెలికితీశారు ?
2016 నవంబరు ఎనిమిదోతేదీన ఐదు వందల రూపాయలు అలాగే వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అప్పుడు కూడా కేంద్రం చెప్పిన మాట ఒక్కటే. అదే నల్లధనాన్ని వెలికితీయడం. అయితే ఇప్పటివరకు ఎన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్‌ మనీని వెలికితీశారో కేంద్రంలోని పెద్దలెవరూ లెక్కలు చెప్పలేదు. ఏవో కొన్ని కాకిలెక్కలు చూపించి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే సామాన్యుడికి అయితే తెలియలేదు కానీ కుబేరులకు మాత్రం పెద్దనోట్ల రద్దుకు సంబంధించి ముందుగా ఉప్పందిందన్న అనుమా నాలున్నాయి. అసలు సంగతి లీక్‌ కావడంతో సంపన్నులు ముందుగానే వాళ్ల దగ్గరున్న పెద్ద నోట్లను బ్యాంకు ల్లో బిందాస్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నల్లడబ్బు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కొన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను అధికారికంగా వెల్లడి చేయ కుండా గుప్తంగా ఉంచడమే నల్ల వ్యాపారం. అధికార, అనధికార… ఇలా అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకూ డబ్బు కావాలి. అయితే అనధికారిక కార్యకలాపాలకు ఉప యోగించే సొమ్మలకు లెక్కాపత్రం ఉండదు. ఈ అమౌంట్‌ ను ఎవరూ ఆదాయం లెక్కల్లో చూపించరు. ఇలా లెక్కా పత్రం లేని డబ్బునే మనం నల్లధనం అంటున్నాం. అయితే నల్లధనం ఇళ్లల్లోని దిళ్లల్లోనో, పరుపుల కిందనో, వాష్‌ రూమ్‌లోనో దాగివుండదు. ప్రతిరోజూ మార్కెట్‌లో చలా మణిలోనే ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రధా ని నరేంద్ర మోడీ చెప్పిన మరో మాట ఇప్పుడు గుర్తు చేసు కుని తీరాలి. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం.ప్రధాని నరేం ద్ర మోడీ అప్పట్లో చెప్పిన మాట ఇదే. పెద్ద నోట్ల రద్దుతో, ఉగ్రవాద మూకలకు నిధులు అందే అవకాశాలు ఉండ వనీ, అంతిమంగా టెర్రరిస్టు కార్యకలాపాలు తగ్గుతా యన్నది అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అయితే నోట్ల రద్దుకు, టెర్రరిస్టు గ్రూపులకు అందే నిధులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఉగ్రవాదులకు నిధులు అందే మార్గా లు చాలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా టెర్రరిస్టు ముఠాలకు అనేక మంది స్లీపర్‌ సెల్స్‌గా పనిచేస్తుంటారు. మూడో కంటికి తెలియకుండా ఈ స్లీపర్‌ సెల్స్‌ నుంచి తమకు అవసరమైనంత సొమ్ములు సేకరిస్తారు టెర్రరిస్టులు. అలాగే డీమానిటైజేషన్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, టెర్రరిస్టు సంస్థల నడ్డి విరచడమే తమ సర్కార్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పారు. అయితే పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలు జరి గాయి. దీంతో, పెద్ద నోట్ల రద్దుకు ఉగ్రవాద కార్యకలాపా లకు ఎలాంటి సంబంధం లేదని తేలి పోయింది.
నల్లధనం నిర్మూలన, దొంగనోట్ల బెడదను వదిలించుకోవడం, ఉగ్ర వాదులకు నిధుల ప్రవాహాన్ని అరికట్టడం – ఈ మూడు లక్ష్యాలతో పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్టు 2016లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో దొంగనోట్ల బెడద, ఉగ్ర వాదులకు నిధులు అనేవి ఊరికే చెప్పుకోడం కోసం చేర్చి నవే తప్ప ప్రధానమైనవి కావన్న సంగతి అందరికీ తెలిసిన దే. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాల ప్రకా రం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో దొంగనోట్ల శాతం చాలా స్వల్పంగానే ఉంది. వాటి బెడద వదిలించుకో వడం కోసం చలామణిలో ఉన్న కరెన్సీలో ఏకంగా 85 శాతం నోట్లను రద్దు చేయడం ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు.
నోట్లు మార్చుకోవడానికి సామాన్యుల అగచాట్లు
2016 నాటి పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామా న్యులు పడని బాధల్లేవు. కరెన్సీని ఎలా మార్చుకోవాలో తెలియక గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాల య్యారు. పట్టణాలు, నగరాల్లో కూడా పేదలు, మధ్య తర గతి వర్గాలకు చెందిన ప్రజలు నానా ఇక్కట్లకు గుర య్యారు. రోజువారి ఇంటి అవసరాలకు కూడా చేతుల్లో డబ్బులు ఉండేవి కావు. చేతుల్లో ఉన్న ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆఫీసు లకు లీవులు పెట్టి మరీ ప్రజలు బ్యాంకులకు పరుగులు తీశారు. చిల్లర కోసం మిడిల్‌ క్లాస్‌ పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనేక బ్యాంకుల్లో ఒకే కౌంటర్‌ ఏర్పాటు చేశారు. బ్యాంకు బయట చాంతాడంత క్యూలు. చాలా చోట్ల ఇలాంటి క్యూలు ఏకంగా రోడ్ల మీదకు వచ్చేశాయి. కొత్త సినిమా విడుదల రోజున టికెట్ల కోసం ప్రేక్షకులు ధియేటర్ల ముందు నిల్చునే దృశ్యాలను ఈ క్యూలు గుర్తుకు తెచ్చాయి.
ఇళ్లల్లో రోజువారీ అవసరాలు చాలానే ఉంటాయి. ఆస్పత్రి ఖర్చుల్లాంటివి వచ్చినప్పుడు, పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే, కేవలం రెండు వేలు మాత్రమే మహా అయితే మూడు వేలు మాత్రమే ఇస్తామంటూ అప్పట్లో అనేక బ్యాంకులు, ఖాతా దారులను సతాయించాయి. దీంతో సామాన్య జనం చేతుల్లో డబ్బుల్లేక, బ్యాంకులో ఉన్న అమౌంట్‌ అవసరా లకు ఉపయోగపడక నానా ఇబ్బందులు పడ్డారు.
పెద్ద నోట్లు జమ చేసి మార్చుకోవడానికి వెళ్లిన సామాన్య ప్రజలకు అన్నీ చేదు అనుభవాలే ఎదుర య్యాయి. గంటలు గంటలు క్యూలో నిల్చులేక అనేక మంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవిం చాయి. అయితే అవేవీ పెద్దగా వెలుగు చూడలేదు. మనదేశంలో చాలా కాలంగా చిన్న చితకా వ్యాపారాలు చేసే వారు కూడా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరు పుతున్నారు. చేతిలో ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు, చెలామణీ కాకపోవడంతో చిన్న చిన్న దుకాణా దారులు బాగా నష్టపోయారు. వారి వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. అంతిమంగా చిన్నిచితకా వ్యాపారులు బతుకు బండి నడుపుకోలేక రోడ్డున పడ్డారు.
ఇప్పటికీ మనదేశంలో మెజారిటీ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. సమాజానికి అన్నం పెట్టే అన్నదాతల పరి స్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. వ్యవసాయం చేద్దామంటే నీరు అందదు. మోటార్‌ వేస్తే మీటర్లు బిగిస్తుం టాయి బీజేపీ ప్రభుత్వాలు. అన్నదాతల నుంచి ముక్కు పిండి మోటార్లు పెట్టినందుకు సొమ్ములు వసూలు చేస్తుం టాయి. 2014లో కేంద్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి దేశంలో సమస్యలు పెరుగు తూనే ఉన్నాయి. దేశంలో ఇన్ని సమస్యలను పక్కన పెట్టి రెండు వేల రూపాయలను రద్దు చేయడంపైనే కేంద్రం తరఫున ఆర్బీఐ దృష్టి పెట్టింది. రెండువేల రూపాయల నోట్ల రద్దుతో సమస్యలన్నీ సద్దుకుంటాయా? ఆలోచించా ల్సిన విషయమే.

  • ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    63001 74320.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News