Thursday, September 19, 2024
Homeహెల్త్Beauty oils: ఈ నూనెలతో మెరిసిపోవచ్చు

Beauty oils: ఈ నూనెలతో మెరిసిపోవచ్చు

ముఖ అందం పెంచే బ్యూటీ ఆయిల్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఉఫయోగిస్తే మీ చర్మం అందంతో, ఆరోగ్యంతో మరింత ఇనుమడిస్తుంది. రెడ్ రాస్బెర్రీ సీడ్ ఆయిల్, సీ బక్థార్న్ ఆయిల్, దానిమ్మ గింజల ఆయిల్, రోజ్ హిప్ సీడ్ ఆయిల్, అవకెడో ఆయిల్, నిరోలీ ఆయిల్, జొజొబా ఆయిల్, బ్లూబెర్రీ సీడ్ ఆయిల్స్ వంటివి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం ఎంతో అందాన్ని సంతరించుకుంటుంది.
రెడ్ రాస్బెర్రీ సీడ్ ఆయిల్: ఇది అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సూర్యకాంతి వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఇ అధికపాళ్లల్లో ఉంది. అంతేకాదు 28-58 ఎస్ పిఎఫ్ తో అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది. అంతేకాదు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ తో కూడుకున్న కెరొటనాయిడ్స్ పాటు సహజసిద్ధమైన రెటినల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాలను పునరుద్ధరించడం ద్వారా చర్మాన్ని యవ్వనంతో మెరిసేలా చేస్తాయి.
సీ బక్థార్న్ ఆయిల్: ఇది చర్మానికి ఎంతో స్వాంత్వననిచ్చే ఆయిల్. సహజసిద్ధమైన రెటినల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ కణాలను పునరుద్ధరిస్తుంది. ఇందులోని విటమిన్ సి గాయాలను వేగంగా మాన్పుతుంది. ఈ ఆయిల్ లో ఒమేగా ఆయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. దానితోపాటు విటమిన్ ఇ, కెరటొనిన్స్ కూడా బాగా ఉన్నాయి. ఈ ఆయిల్ యాంటాక్సిడెంట్ల పవర్ హౌస్. దానిమ్మ గింజల ఆయిల్: ఇందులో మూడు రెట్లు యాంటాక్సిడెంట్లు ఉనాయి. ఇందులోని గ్రీన్ టీ, రెడ్ వైన్, అధిక ప్రమాణంలో ఉన్న ఎలియాజిక్ యాసిడ్లు సూర్య రశ్మి కారణంగా చర్మంపై ఏర్పడ్డ మచ్చలను తగ్గిస్తాయి. చర్మం దెబ్బతినకుండా పరిరక్షిస్తాయి. అంతేకాదు చర్మ కాన్సర్ పెరగకుండా కూడా ఈ ఆయిల్ సహకరిస్తుందని పలు క్లినికల్ ట్రయల్స్ లో సైతం తేలింది. పైగా పొట్టపై ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించడంలో కూడా ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

- Advertisement -

రోజ్ హిప్ సీడ్ ఆయిల్: ఈ ఆయిల్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంది. దీనివల్ల కొల్లాజెన్ బాగా వ్రుద్ధిచెందుతుంది. ఈ ఆయిల్ లో ఉన్న యాంటాక్సిడెంట్ల వల్ల కణాలు పునరుద్ధరించబడతాయి. అంతేకాదు మచ్చలను, సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని, స్ట్రెచ్ మార్కులను సైతం తగ్గించడంలో ఈ ఆయిల్ ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ నూనె చర్మంపై రాసుకుంటే ఎంతో వేగంగా ఆరిపోతుంది. ఫలితంగా
చర్మం జిడ్డుగా కనిపించదు. అంతేకాదు ఈ ఆయిల్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి.

అవకెడో ఆయిల్: దీనివల్ల చర్మం ఎలాస్టిసిటీతో పాటు మ్రుదుత్వం కూడా పెరుగుతుంది. ఇందులో స్టెరొలిన్ అనే సహజసిద్ధమైన స్టెరాయిడ్ ఉంది. అది చర్మానికి హైడ్రేషన్ తోపాటు, సిల్కీ చర్మాన్ని అందింవ్వడమే కాకుండా వయసుతో ఏర్పడ్డ మచ్చలు, హైపర్ పిగ్మంటేషన్ వంటి సమస్యలను కూడా అరికడుతుంది. ఇందులో లెసిథిన్ పుష్కలంగా ఉంది. ఇది చర్మం ఎలాస్టిసిటీని పెంపొందించడమే కాకుండా పలు ఇతర పదార్థాలను కూడా గ్రహించేలా సహాయపడుతుంది.

నెరొలీ ఆయిల్: చర్మం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది. ముఖ్యంగా ఇ చర్మంపై బాగా పనిచేసే యాంటి ఏజింగ్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఇది. చర్మంలో ఎలాస్టిసిటీని పెంపొందించడమే కాకుండా చర్మంపై ఏర్పడ్డ గీతలను తగ్గిస్తుంది. ముడతలను, స్ట్రెచ్ మార్స్క్ పోగొడుతుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ లో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. యాక్నే, చర్మం ఇన్ఫెక్షన్లను సైతం నివారిస్తుంది.
జొజొబా ఆయిల్: జిడ్డు చర్మం వారికి ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చర్మంలో సమతుల్యత లోపించకుండా ఇది పరిరక్షిస్తుంది. ఈ ఆయిల్ లో మినరల్స్, విటమిన్లు అత్యధికంగా ఉన్నాయి. అంతేకాదు చర్మంలోపలికంటా ఎంతో సులువుగా ఇది ఇంకుతుంది. చర్మంపై జిడ్డుతనం అస్సలు కనిపించదు. సెబమ్ ఉత్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా జిడ్డు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కన్నా కూడా ఇది చర్మంపై బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటిమైక్రోబియల్ గుణాలు కూడా బాగా ఉన్నాయి. యాక్నేను సైతం ఇది ఎంతో శక్తివంతంగా అరికడుతుంది.

బ్లూబెర్రీ సీడ్ ఆక్ష్ల్: ఇది యాంటి ఏజింగ్ ఆయిల్. ఈ ఆయిల్ లో ఫిలోన్యూట్రియంట్స్ అనే యాంటాక్సిడెంట్లు సమ్రుద్ధిగా ఉన్నాయి. ఇవి కణాలను పరిరక్షించడం ద్వారా తొందరగా వయసు మీద పడకుండా, చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో విటమిన్ ఇ తో కూడిన టొకొట్రైనోల్స్ ఉన్నాయి. ఇవి ఎంతో నాణ్యతగల విటమిన్ ఇ. ఫ్రీ రాడికల్ డ్యామేజి నుంచి ఇది కాపాడుతుంది. అంతేకాదు ఈ ఆయిల్ ఎంతో తేలికగా ఉంటుంది. జిడ్డు ఉండదు. ఇందులోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మం లోపలిపొరల్లోకి సులభంగా ఇంకి నాణ్యమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News