Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: గని ఉద్యోగులకు అవగాహన సదస్సు

Singareni: గని ఉద్యోగులకు అవగాహన సదస్సు

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గని ఆవరణలో ఆర్కీ-7 గ్రూపు ఏజెంట్ మాలోత్ రాముడు రక్షణపై ఉద్యోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇటీవల ఏజెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మాలోత్ రాముడు ఉద్యోగులకు పరిచయం చేసుకొని ఆర్కే-7 గనిని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ప్రతి ఒక్కరూ రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. నిత్యం యోగా, వ్యాయామం సాధన చేయాలని పేర్కొన్నారు. గనుల్లో గైర్హాజరును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగుల హాజరు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రక్షణ పై ప్రసంగించిన శ్రీనివాస్ అని కార్మికునికి ఆర్కే-7 గ్రూపు ఏజెంట్ మాలోత్ రాముడు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సాయి ప్రసాద్, రక్షణాధికారి రవి శంకర్, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ మేండే వెంకట్, ఏరియా సెక్రటరీ అశోక్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీలు తొంగల రమేష్, రౌతు సత్యనారాయణ, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, అండర్ మేనేజర్లు రవీందర్, వెంకట్ రామ్, రవితేజ, బాలకృష్ణ, లక్ష్మణ్, ఇంజినీర్ సుధీర్ రెడ్డి, వెంటిలేషన్ అధికారి జగదీశ్వర్ రావు, సంక్షేమాధికారి సంతన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News