Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Jupadubangla: 31వ రోజుకు చేరిన రైతుల జలదీక్ష

Jupadubangla: 31వ రోజుకు చేరిన రైతుల జలదీక్ష

జూపాడుబంగ్లా మండల పరిధిలో మండ్లెం గ్రామం రైతులు సాగునీరు ఇవ్వాలని గత 30 రోజులుగా రైతులు జల దీక్షనిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శిబిరాన్ని దర్శించి తన మద్దతు తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టి రైతులను ఆదుకోవాలని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండ్లెం, తంగడంచ, భాస్కాపురం, మెట్ట పొలాల రైతులకు సాగునీరు అందించాలన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకొని కరువును దూరం చేసేందుకు సహకరించాలన్నారు. రాయలసీమ రైతంగానికి కృష్ణ, గోదావరి నదులపై ఎత్తిపోతల ద్వారా సాగునీ నీరు అందించాలన్నారు. వెనకబడిన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు నీళ్లు, నిధులు, నియామకాలు అవసరమన్నారు. నీటి విషయమై రైతులు చేపడుతున్న దీక్షకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సురేష్,శివప్రసాద్, అరుణ్, శీను, నాగరత్నం, ఈశ్వరయ్య, ఆదామ్, విజయభాస్కర్, సుదర్శన్, సుధాకర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News