ఓటును తొలగించేందుకు మరణ ధ్రువీకరణ పత్రము తప్పని సరిగా ఉండాల్సిందేనని మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ స్పష్టం చేశారు. ఐడిఓసిలోని కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై విచారణ చేపడుతున్న పలు అంశాలను సంబంధిత రెవెన్యూ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫారం 6 లో పెండింగ్ లో ఉన్న అంశాలను అధికారులతో సమీక్షించారు. తొలగింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ మరణ ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఆ ఓటర్ పేరును తొలగించవలసి ఉంటుందని తెలియ చెప్పారు. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గం పరిశీలన చేయవలసిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫారం 6 ,7 ,8 లలో తీసుకొని అబ్బాయే చర్యలను వివరించారు సాధ్యమైనంతవరకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మహబూబాబాద్ తొర్రూరు ఆర్డీవోలు కొమరయ్య రమేష్ తాసిల్దార్లు ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.