సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విరాట్ నగర్ 12వ వార్డుకు చెందిన వెలిశాల నాగ దుర్గ భవాని అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పటల్ కి వెళ్లి వైద్య ఖర్చులకు ప్రభుత్వ సహాయం అందించాలని నిమ్స్ హాస్పటల్లో వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ను తీసుకొని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి అందజేయగా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్వయంగా ఎల్ఓసి పత్రాన్ని హైదరాబాద్ సచివాలయానికి తీసుకువెళ్లి వైద్య ఖర్చులకు (1,50,000) ఒక లక్ష యాభై వేల రూపాయలను మంజూరు చేయించుకొని సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వెలిశాల నాగ దుర్గ భవానికి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని అందజేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, వార్డు కౌన్సిలర్ల మహ్మద్ సాలీమా ఖాతున్ ఘఫర్, సురేంద్ర రెడ్డి తదితులున్నారు.