Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

Sandra: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

నిరుపేదలను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పలు కారణాల చేత అనారోగ్యానికి గురైన వారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అయిన ఖర్చుల తాలూకా బిల్లులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయగా మంజూరైన 145 మంది లబ్ధిదారులకు 73 లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. ఆపదలో ఆదుకున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించటం ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పై విమర్శించేవారు గత ప్రభుత్వాలలో ఎందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందించలేకపోయారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగేళ్ల కాలంలో 4612 మంది లబ్ధిదారులకు 25 కోట్ల 66, లక్షల రూపాయలు సత్తుపల్లి నియోజకవర్గంలో సహాయం అందిందన్నారు. విమర్శించడం సులభం,పనిచేయటం మాటలతో అవదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కొరకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలను తీసుకువచ్చి పేదరిక నిర్మూలన కొరకు కృషి చేస్తూ చేయూతనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News