Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Gummanuru: సీఎం ప్రోగ్రాం సక్సెస్ చేయండి

Gummanuru: సీఎం ప్రోగ్రాం సక్సెస్ చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అధికారులందరూ సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఈ నెల 30న పర్యటిస్తున్న సందర్భంగా పత్తికొండలోని స్త్రీ శక్తి భవన్ నందు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రజలలో ఎంత అభిమానంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైనరో అదే రీతిలో ఇప్పుడు పత్తికొండ మండలంలో కూడ ప్రజలు హజరు అవుతారని అందుకు పోలీస్ అధికారులు సహకరించాలని, అని మండలాలోని ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడటానికి ఎంతో సంతోషంగా వస్తారని వారిని సభా ప్రాంగణంలోకి నేరుగా చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని సభా ప్రాంగణంలో పాల్గొనే ప్రజలకు త్రాగునీరు,మజ్జిగ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ని అదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ మాట్లాడుతూ ఇది వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు 5 వరకు నిర్వహించి విజయవంతం చేశామని, అదే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని కూడా విజవంతంగా చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదిన ప్రమాణ స్వీకరణ చేసి నాలుగు సంవత్సారాలు పూర్తి అవుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందుకే ఈ నెల 30వ తేదిన రైతులకు సంబందించిన రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా స్థానిక మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం, శాసన సభ్యులు కంగాటి శ్రీదేవి కృషి చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం అని పేర్కొన్నారు.అధికారులందరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత నాలుగు రోజుల నుండి ప్రణాళిక రూపొందించుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఈరోజు సాయంత్రంలోపు ప్రిపరేటరీ పనులు పూర్తయితాయని కలెక్టర్ వివరించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రవాణా సదుపాయంతో పాటు ఇక్కడికి వచ్చాక సభ ప్రాంగణంలో త్రాగునీరు,మజ్జిగ ప్యాకెట్లు,స్నాక్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బస్సులో హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వస్తారు కాబట్టి ఏవైనా తీగలు బస్సు కి అడ్డంగా ఉన్నట్లైతే వాటిని రీప్లేస్ చేయడం గానీ లేదంటే ఎత్తు పెంచడం గాని వంటి చర్యలు తీసుకోవడంతో పాటు,సభా ప్రాంగణం వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా బ్యాకప్ జనరేటర్ లు ఏర్పాటు చేసే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు.శానిటేషన్ పనులకి సంబంధించి డిపిఓ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.హెలిప్యాడ్,సభా ప్రాంగణంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేసేలా చూసుకోవాలని, హెలిప్యాడ్ వద్ద ఒక మెడికల్ క్యాంప్, సభా ప్రాంగణంలో 5 మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసే పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిఎమ్హెచ్ఓ ని అదేశించారు.*

- Advertisement -

*పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల విభజనలో భాగంగా పత్తికొండ నియోజకవర్గ సమస్యలను గుర్తించి పరిపాలన సౌలభ్యం కోసం ఆర్డిఓ, డిఎస్పీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజున మా పత్తికొండ నియోజకవర్గంలో రైతులకు అందిస్తున్న నాలుగవ విడత రైతు భరోసా నగదు జమ కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులు అందరూ కృషి చేయాలని,రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేస్తామన్నారు.అదే విధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వచ్చే ప్రజానికానికి మంచి నీరు,మజ్జిగ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ను కోరారు.ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు బందోబస్తు ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లు చేశామని, ప్రజలను పార్కింగ్ స్థలం నుండి సభా ప్రాంగణం వరకు ఎక్కువ దూరం నడవకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ గ్రామాల నుండి పెద్దఎత్తున రైతులు కార్యక్రమానికి రావడానికి ఉత్సుకత చూపిస్తున్నారని వారిని సభకు తీసుకొని రావడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.తదనంతరం హెలిప్యాడ్,బహిరంగ సభా ప్రాంగణాన్ని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి,ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్, సెబ్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్,జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News