Saturday, November 23, 2024
HomeతెలంగాణCabinet sub-committee: మళ్లీ భేటీ కానున్న క్యాబినెట్ సబ్ కమిటీ

Cabinet sub-committee: మళ్లీ భేటీ కానున్న క్యాబినెట్ సబ్ కమిటీ

వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విశేష కృషిని చేస్తుంది, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చితికిపోయిన కుల వృత్తులకు అన్ని రకాలుగా సీఎం కెసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్, కులవృత్తులకు మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా త్వరలో 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టిందన్నారు, వీటికి సంబంధించిన సంపూర్ణ విధివిధానాలను రూపొందించాల్సిందిగా మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నేడు సచివాలయంలో కుల వృత్తులకు చేయూతనందించే దిశగా సుదీర్ఘంగా చర్చించిందని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన మంత్రుల బృందం మరోసారి సోమవారం భేటీ కావాలని నిర్ణయించిందన్నారు.
29న జరిగే సమావేశంలో తుది విధివిధానాలను రూపొందించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదానికి పంపుతామని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు. సీఎం ఆమోదంతో బీసీ కులవృత్తుల లబ్దిదారులకు 1లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల.

- Advertisement -

ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాణి కుముదిని, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News