Saturday, November 23, 2024
Homeనేషనల్Delhi: కొత్త పార్లమెంట్ జాతికి అంకితం

Delhi: కొత్త పార్లమెంట్ జాతికి అంకితం

పార్లమెంట్ సరికొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దీంతో స్వతంత్ర భారతంలో తొలిసారి పార్లమెంట్ భవనాన్ని మనం నిర్మించుకుని అందులో సభలో నిర్వహించబోతున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీక ఈ కొత్త పార్లమెంట్ అంటూ ప్రధాని ఈసందర్భంగా పేర్కొన్నారు. 888 మంది లోక్ సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునేందుకు అనువుగా ఈ కొత్త భవనం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నిర్మించారు. జాతీయ పక్షి నెమలి ఆకారంలో లోక్ సభ, జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభను నిర్మించటం మరో హైలైట్.

- Advertisement -

రాజదండం సెంగోల్ ను ప్రధాని లోక్ సభలో ప్రతిష్ఠించారు. కాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దూరంగా ఉండిపోవటం సంచలనంగా మారింది. విపక్షాల నిరసన మధ్యనే ఈ కార్యక్రమం అంగరగ వైభవంగా సాగింది. సంప్రదాయ బద్ధంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News