Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు

Nandyala: వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు

నంద్యాల జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టర్‌ డా. మనజిర్ జిలాని సమూన్ అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో యంత్రం 2023-24 సంవత్సరానికి నూతన జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల జారీపై జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాలపరిమితితో జిల్లాలోని జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్ల మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వుల నెం.38 జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐ అండ్‌ పి ఆర్‌ ) డిపార్ట్‌మెంట్‌ తేది. 30.03.2023 జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని నిబంధనల మేరకు జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ద్వారా అర్హతలు కలిగిన పాత్రికేయులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్స్ సమర్పించిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు, పిరియాడికల్స్, వెటరన్ పాత్రికేయులలో అన్ని నిబంధనలు పూర్తిచేసిన వారికి మొదటి విడతలో 305 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీరికి త్వరలోనే కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం అక్రిడిటేషన్ మంజూరు కాని వారికి జీవోలోని నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించిన పిదప తదుపరి కమిటీ సమావేశంలో పరిశీలించి అక్రిడిటేషన్లు మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో బస్సు పాసులు వర్తించేలా అనుమతికి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీనివాసులును కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ కన్వీనరు, మరియు డిపిఆర్ఓ మల్లికార్జునయ్య, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు బాలమద్దిలేటి (సాక్షి), జయప్రకాష్ (వార్త), సాయి వర్మ (టివి9), గృహ నిర్మాణ శాఖ ఈఈ మాధవరావు, కార్మిక శాఖ, ఆర్టీసీ,రైల్వే శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News