Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్MEPMA: ఋతుక్రమంపై అపోహ వద్దు, అవగాహనే ముద్దు

MEPMA: ఋతుక్రమంపై అపోహ వద్దు, అవగాహనే ముద్దు

మహిళ జీవితంలో ఋతుక్రమము సహజ ప్రక్రియ అని రుతుక్రమంపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని మెప్మా టిఎంసి శాంత కుమారి మహిళలకు సూచించారు. పట్టణంలోని స్థానిక జైకిసాన్ పార్క్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలు పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మెప్మా టిఎంసి శాంతకుమారి మాట్లాడుతూ కుటుంబంలో పిల్లలకు ఋతు క్రమం పై అవగాహన కల్పించాలని, అలాంటి సమయములో పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలని, సానిటరీ నాప్కిన్స్ ఉపయోగించుకోవాలనే చైతన్యవంతులు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మెప్మా ఎమ్ ఓ అర్చన, సి ఓ ప్రమీల, టి ఎల్ ఎఫ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఎన్ఎం , ఎస్ హెచ్ జి మెంబర్స్, ఆర్పీలు మహిళలు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News