Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Jogi Ramesh: డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో

Jogi Ramesh: డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో

పట్టుమని పది వాగ్ధానాలూ నెరవేర్చని డర్టీ ఫెలో బాబు అన్నారు జోగి రమేష్. జోగి రమేష్ ప్రెస్ మీట్ హైలైట్స్ ఈ కింది విధంగా ఉన్నాయి…..

- Advertisement -
  • ఆల్‌ ఫ్రీ బాబు కాస్తా ఆల్‌ కాపీ బాబు అయ్యాడు.
  • మేనిఫెస్టో జగన్‌ గారికి ఒక పవిత్ర గ్రంథం.
  • చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం
  • ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి శ్రీ వైఎస్‌ జగన్‌
  • 98.5 శాతం మేనిఫెస్టోను 4 ఏళ్ళలోనే నెరవేర్చిన నాయకుడు జగన్‌ గారు.
  • మా హయాంలో ప్రతి ఊర్లో అభివృద్ధి.. ప్రతి గడపలో సంక్షేమం
  • చంద్రబాబూ..నీకు దమ్ము, ధైర్యం ఉంటే మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా..?: మంత్రి శ్రీ జోగి రమేష్‌ సవాల్
  • బీసీల భక్షకుడు చంద్రబాబు..బీసీల ఆత్మగౌరవం జగనన్న.
  • 25 మంత్రి పదవుల్లో 17 బడుగు బలహీనవర్గాలకే ఇచ్చిన నేత శ్రీ వైఎస్‌ జగన్‌
  • బీసీలకు ఒక్క రాజ్యసభ సీటన్నా ఇచ్చావా బాబూ..?
  • ఒంటరిగా మాపై పోటీ చేయగల సత్తా నీకుందా చంద్రబాబూ..?
  • పిరికిపందవి..నువ్వు జగన్‌గారిని ఓడిస్తావా..?
  • చంద్రబాబు పొత్తులతో పొర్లాడటం తప్ప చేసేదేమీ లేదు.
  • మీరంతా కట్టకట్టుకుని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు.
  • జగన్‌ గారు సింహంలా సింగిల్‌గానే వస్తాడు.: మంత్రి శ్రీ జోగి రమేష్‌

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్‌ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

పట్టుమని పది వాగ్ధానాలనూ నెరవేర్చని డర్టీ ఫెలో చంద్రబాబు:

  • మహానాడులో డర్టీ బాబు–టిష్యూ మేనిఫెస్టో విడుదల చేశాడు. అందుకే టీడీపీ మేనిఫెస్టోను చించి చెత్తబుట్టలో వేస్తున్నాను.
  • 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో 650 వాగ్ధానాలు ఇచ్చాడు.
    -ఇది చంద్రబాబు మేనిఫెస్టో. ఇందులో ఏ ఒక్కటీ నెరవేర్చని వాగ్ధానాలను చించి ముక్కలు చేసి డస్ట్‌ బిన్‌లో పడేస్తున్నాను.
  • 650 వాగ్ధానాలు చేసిన వ్యక్తి వాటిలో పట్టుమని పది వాగ్ధానాలను కూడా నెరవేర్చని డర్టీ ఫెలో చంద్రబాబు.
  • 2014–19 మధ్య 5 ఏళ్ల పాటు పరిపాలన వెలగబెట్టిన చంద్రబాబు తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశాడు.
  • ఈ సిగ్గులేని ఆల్‌ ఫ్రీ బాబు..1995, 1999, 2004 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అబద్దపు హామీలు ఇచ్చాడు.

ఆల్‌ ఫ్రీ బాబు కాస్తా..కాపీ బాబు అయ్యాడు:

  • ఆల్‌ ఫ్రీ బాబు అనుకునే వాళ్లం..ఇప్పుడు కాపీ కొట్టి నకిలీ బాబు అయ్యాడు.
  • అసలు చంద్రబాబు పార్టీనే నకిలీది.. స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర పార్టీని, గుర్తును కూడా కొట్టేశాడు.
  • చంద్రబాబు మేనిఫెస్టో కూడా నకిలీదే…అది కూడా కొట్టేసిందే.
  • చంద్రబాబూ..నీకు, దమ్ము, ధైర్యం ఉంటే నీ మేనిఫెస్టో, మా 2019 మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా..?
  • మా ముఖ్యమంత్రి గారు నాలుగేళ్లలో 98.5 శాతం చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చిన చరిత్రకారుడు జగన్‌గారు.
  • నువ్వూ, నీ తాబేదార్లు చర్చకు రాలేరులే. నీకు ఆ దమ్ములేదులే చంద్రబాబూ…
  • మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు మా మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావిస్తారు.
  • ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి తాపత్రయ పడ్డ ముఖ్యమంత్రిని ఇప్పుడు చూస్తున్నాం.
  • మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు.

14 ఏళ్లలో నువ్వు చేయలేనిది 4 ఏళ్లలో చేసి చూపించాం:

  • తల్లికి వందనం అట..ఆల్‌ రెడీ ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి చేరువు చేస్తున్నాం..
  • ఇప్పుడిచ్చిన మేనిఫెస్టోను కూడా చించి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.
  • నాలుగేళ్ల కాల వ్యవధిలో 14 ఏళ్లలో నువ్వు చేయలేని కార్యక్రమాలను చేసి చూపించాం.
  • 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏపీలో రూ.2.11 లక్షల కోట్లను డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరవేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.
  • ప్రతి గ్రామం వెళ్లి చూడు..సచివాలయం కనిపిస్తోంది..రైతు భరోసా, ఆస్పత్రి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.
  • ప్రతి గడపకూ సంక్షేమం..అమ్మ ఒడి, ఆసరా, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా లాంటివి ఎన్నో కనిపిస్తాయి.
  • ప్రతి ఊర్లో అభివృద్ధి..ప్రతి గడపలో సంక్షేమం కనిపిస్తుంది.
  • కేవలం నాలుగేళ్ల కాల వ్యవధిలో జగన్‌గారి సారథ్యంలో ఇది సాధ్యమైంది.
  • ఏ ముఖ్యమంత్రి అయినా ఇదంతా చేయగలడా..? దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు జగన్‌గారి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి శెభాష్ అంటున్నారు.
  • మేం గర్వంగా, ధైర్యంగా చెప్తున్నాం..ఒక పక్క పోర్టులు, మరో పక్క హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం.
  • మెడికల్‌ కళాశాలలు, స్టేట్‌ హైవేస్, నేషనల్‌ హైవేస్‌…ఇవన్నీ నాలుగేళ్ల కాలంలోనే చేపట్టాం.

పిరికిపంద చంద్రబాబు జగన్‌ గారిని ఓడిస్తాడా..?:

  • చంద్రబాబుకు జగన్‌గారి గురించి మాట్లాడే అర్హతే లేదు.
  • నీ అంతట నువ్వు నిలబడి ఒక్కడిగా మాపై పోటీ చేయగల సామర్థ్యం నీకుందా..?
  • పిరికిపంద అయిన చంద్రబాబు.. జగన్‌గారిని ఓడిస్తాడా..?
  • నువ్వు పొత్తులతో పొర్లాడటం తప్ప చేసేదేమీ లేదు.
  • మీరంతా కలిసి వచ్చి ఏం చేయగలరు..?
  • ఒక వీరుడు, ధీరుడు, ధీశాలి సింహంలా సింగిల్‌గానే వస్తాడు.
  • 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడో ఈ ఆల్‌ కాపీ బాబు 2024 ఎన్నికల్లో అడ్రస్‌ గల్లంతు ఖాయం.
  • వచ్చే మహానాడు నాటికి చంద్రబాబు టీడీపీకి రాజకీయంగా పాడెకట్టి, పిండం పెడతారు.
  • బంగాళాఖాతంలో టీడీపీని కలిపేసి, హైదరాబాద్, సింగపూర్, అండమాన్‌ లాంటి చోటికి చంద్రబాబు వెళ్లిపోవడమే ఇక మిగిలివుంది.
  • పిట్టల దొరలా నీ వేషాలు, చేష్టలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

అన్నీ ఇచ్చిఉంటే నీ దీపం ఎందుకు ఆర్పేస్తారు బాబూ..?:

  • నీ 14 ఏళ్ళ చరిత్రలో నిరుద్యోగభృతి ఇవ్వకుండా ఏం పీకావ్‌ చంద్రబాబూ..?
  • ఇప్పుడు వెళ్లండి నిరుద్యోగులంతా నిన్ను, నీ కొడుకును చెంపలు పగలగొడతారు.
  • దీపం పథకం కూడా అంతే..అప్పుడిస్తే నీ దీపం ఎందుకు ఆర్పేశారు..?
  • ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నీ 14 ఏళ్లలో ఎందుకు చేయలేదు.
  • ఇప్పుడొచ్చి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తాడట..
  • దుర్మార్గుడైన చంద్రబాబు .. బ్యాంకుల్లో కుదవపెట్టిన మహిళల బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నాడు.
  • దాన్ని నెరవేర్చకుండా రైతులందర్నీ మోసం చేసినందుకే 23 సీట్లకే పరిమితం చేశారు.

బీసీల భక్షకుడు చంద్రబాబు..బీసీల ఆత్మగౌరవం శ్రీ వైఎస్‌ జగన్‌:

  • ఈరోజు వచ్చి బీసీలకు రక్షణ కవచం అంటాడు..బీసీలను భక్షించిందే నువ్వు కదా..?
  • బీసీల ఓట్లేయించుకుని, బీసీలే నా అండ, దండ అన్నాడు..బీసీలందర్నీ తొక్కి నారతీశాడు.
  • మా బీసీలకు ఒక్కరికైనా రాజ్యసభ సీటిచ్చావా..?
  • ఏపీ క్యాబినెట్‌లో 25 మంత్రి పదవులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.
  • బీసీల ఆత్మగౌరవం జగనన్న. వారే చంద్రబాబును తాటతీసి తరిమి కొడతారు.
  • ఇంటింటికి మంచినీరు మేమిస్తున్నాం ఇప్పుడు..నువ్వున్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయావ్‌.
  • పేదల రక్తం పీల్చిన చంద్రబాబు, అమరావతిలో 50 వేల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే..సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని మాట్లాడి, ఇప్పుడు పేదలను ధనవంతులను చేస్తానంటే నమ్ముతారా…?
  • అందుకే పేదలు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పెత్తందార్ల తాటతీశారు.

ఇచ్చిన మాటకోసం ఎందాకైనా పోరాడే వ్యక్తి శ్రీ జగన్‌:

  • మేనిఫెస్టో అంటే గౌరవం, బాధ్యత, విలువ, విశ్వనీయత ఉండాలి.
  • ఒక లీడర్‌ ఒక మాట చెప్తే ఆ మాట కోసం ఎందాకైనా సరే పోరాడే శక్తి ఉండాలి.
  • మాట చెప్పడం..మడిచి పక్కన పడేయడం చంద్రబాబు నైజం.
  • మా లీడర్‌ ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసం ఎందాకైనా పోరాడే శక్తి జగన్‌గారి వద్ద ఉంది.
  • పేదలను నిలబెట్టగల సత్తా, సంపన్నులను చేయగల వ్యక్తిత్వం జగన్‌ గారిది.
  • ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేని పెత్తందార్లు రాజమండ్రిలో పోగయ్యారు.
  • మహానాడుకు మేం ఆటంకాలు కలుగజేయలేదు…గాలి, వాన, దుమ్ము వచ్చి మీరే కొట్టుకుపోయారు.
  • అక్కడ 15 వేల మంది లేరు..15 లక్షలు అంటారు.
  • దీనికే జగన్‌ గారు జనాన్ని రానివ్వలేదంటారు..మేమన్నా వర్షాన్ని పంపించామా..?
  • దుర్మార్గమైన చంద్రబాబు మాటలు ప్రజలు వినరు, నమ్మరు.
  • ఇతను ఆల్‌ ఫ్రీ బాబు అని అందరికీ తెలసు..ఇప్పుడు ఆల్‌ కాపీ బాబుగా మారిపోయాడు.
  • చించి పడేసిన టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టతో సహా చంద్రబాబుకు పార్శిల్‌ పంపిస్తున్నా…
  • మొన్న కరకట్ట వద్దకు వెళ్లా..కలవనివ్వలేదు..ఈ సారి కూడా కరకట్టకు పంపిస్తా.
  • జగన్‌ గారి గురించి తెలిసిన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు జయహో వైఎస్ఆర్సీపీ అంటున్నారు.
  • కష్టాలు..ఇబ్బందులున్నా మనల్ని నిలబెడుతున్నాడని ఆయనపై ప్రజలకు నమ్మకం ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News