Friday, November 22, 2024
HomeతెలంగాణJagadish Reddy: వచ్చే ఎన్నికలో చిరుమర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

Jagadish Reddy: వచ్చే ఎన్నికలో చిరుమర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

రామన్నపేటలో 8.5 కోట్ల రూపాయల రోడ్డు విస్తరణ పనులకు మంత్రి జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తిది అభివృధి దాహం, ఇలాంటి నాయకుడు మీ నియోజక వర్గంలో ఉండటం మీరు చేసుకున్న అదృష్టం వచ్చే ఎన్నికలో చిరుమర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని తెలిపారు. ఆంధ్ర నాయకుల కోసం రేవంత్ రెడ్డి పిట్టలదొర అవతారం ఎత్తారు అని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులలో బాధ్యతలు తెలిసినవాళ్ళు లేరని.. అదే దుర్దుష్టం అని అన్నారు. రాష్టం పుట్టుక ఇష్టంలేని ప్రధాని నాయకత్వం వహిస్తున్న పార్టీ ఇప్పుడు సంబరాలు చేస్తా అనడం చావకొట్టినోడే దినం చేస్తా అన్నటుందని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది బిఅరెస్ పార్టీ అని.. అందుకే తెలంగాణ సంబరాలు చేసుకునే హక్కు బిఅరెస్ పార్టీకె ఉందన్నారు. ఆంధ్ర నాయకుల కోసం…. పిట్టల దొర అవతార మెత్తిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ప్రదాని మోడి, రాహుల్ గాంధీ పెయిల్యూర్ అయ్యారని.. కానీ తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ సెక్సస్ అయ్యాడని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురుంచి మాట్లాడుతూ అభివృద్ధి దాహంతో ఉరుకులు పరుగులు పెడ్తున్నాడు అని అన్నారు.ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య గారిని గెలిపించే బాధ్యత మనందరిపై ఉన్నది అని అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ రామన్నపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే నిధులు మంజూరు చేయించి రోడ్లు విస్తరణ పనులకు శంకుస్థాపన జరిపించానని అందరూ సహకరించాలని అభివృధి జరిగితే పెట్టుబడులు వస్తాయని పట్టణం అన్ని రంగాలలో ముందుకెళ్తుందని ఉద్ధఘటించారు. రామన్నపేట పట్టణంలో పద్మశాలి భవనం కోసం 30 లక్షలు జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ ప్రభుత్వం దళితులకు అనేక రంగాలలో అవకాశాలు కల్పించిందని అంబేద్కర్ పేరు సెక్రటేరియట్ పెట్టడం చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా లేదని మన హైదరాబాదులో కేసీఆర్ సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్ట డం జరిగిందని అన్నారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. రామన్నపేట పట్టణంలో అంబేద్కర్ భవనంకు 30 లక్షలు మంజూరు చేయించినానని అన్నారు. 2019లో ఎలక్షన్ల ముందు ఆర్ఎంపీ డాక్టర్లు నన్ను కలిసి భవనం కోసం కృషి చేయాలని నన్ను కోరగా రెండు గుంటల స్థలం కేటాయించి పది లక్షలు మంజూరు చేయించాను అని అన్నారు. వడ్డెర సోదరులకు వడ్డెర సంఘం భవనం కావాలని అడిగితే 10 లక్షలు మంజూరు చేయించానని అన్నారు. గౌడ సోదరులకు కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేయించానని తెలిపారు. కులాల ఆత్మగౌరవం కోసం కుల వృతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. 7800 గొర్రెల యూనిట్లు మన జిల్లాలో మన నకిరేకల్ నియోజకవర్గంలో ఫస్ట్ విడత మొదలుకానిందని మంత్రిగారి సహకారంతో 9వ తారీఖు నాడు ప్రారంభం అవుతుందని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కేసీఆర్ ప్రభుత్వం కు అండగా ఉండాలని ఆదరించాలని మూడవసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించాలని ఓటేసి గెలిపించాలని తెలిపారు. మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి జడ్పిటిసి పున్న లక్ష్మి జగన్మోహన్ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ కార్యదర్శి పోషబోయిన మల్లేశం టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పోతరాజు సాయి సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి రేఖ యాదయ్య పిట్టె కృష్ణారెడ్డి నీల జయమ్మ కడమంచి సంధ్య మెట్టు మహేందర్ రెడ్డి బొక్క యాదిరెడ్డి చెరుకు సోమయ్య అప్పం లక్ష్మీనరసింహ ధర్మేరాని ముత్యాల సుజాత ఉప్పు ప్రకాష్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తిమ్మాపురం మహేందర్ రెడ్డి దోమల సతీష్ గొరిగె నరసింహ వేమవరం సుధీర్ గాదె పారిజాత ఎండి ఆమీర్ ఉప సర్పంచ్ పొడిచేడు కిషన్ మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ నాయకులు మందడి రవీందర్ రెడ్డి బందెల రాములు అంతటి రమేష్ రామిని రమేష్ కడారి స్వామి బత్తుల వెంకన్న బొక్క పురుషోత్తం రెడ్డి పోలేబోయిన నరసింహ కాటేపల్లి యాదయ్య మీర్జా ఇనాయత్ బేగ్ జాడ సంతోష్ బొడ్డు అల్లయ్య దుండగుల సమ్మయ్య బాసని రాజు ముక్కామల నరేందర్ ఆవుల నరేందర్ ఆవుల శ్రీధర్ నోముల శంకర్ గాదె శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News