వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల అయిందని ఎమ్మెల్యే సంబరాలు జరుపుతున్నాడని నవ్వాలో ఏడువాలో తెలియదని బిజెపి సీనియర్ నాయకులు భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆయన నివాస కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతవారం ఆళ్లగడ్డలో కొందరు నాయకులు మాట్లాడకూడని పదజాలంతో మాట్లాడారని, వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఒకరు చంపుతామని బెదిరిస్తే.. ఇంకొకరు ఏకంగా ల్యాండ్ సెటిల్మెంట్లు దొంగతనాలు దొమ్మీలు చేస్తున్నారని, ఎమ్మెల్యేకు ఓటేసి గెలిపించినందుకు ఆయన ఏం చేస్తున్నాడు రౌడీలను పెట్టి మామూళ్లు వసూలు చేయడం, పక్క ఊరు నుండి వ్యాపారాలకు వచ్చే వారిని వ్యాపారస్తులను తన్ని వాళ్ళ లారీలల్లో టైర్ల గాలి తీసి డబ్బులు కట్టమని చెప్పడం గతంలో చాలా ఉన్నాయని ఆయన అవినీతి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఆళ్లగడ్డ అభివృద్ధి జరగలేదని ఆయన అభివృద్ధి చెందాడని భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందాన ఉందన్నారు ఆళ్లగడ్డ టౌన్ పరిస్థితి ఎక్కడ అభివృద్ధి జరిగిందో సూటిగా ప్రశ్నించారు ఆయన ఇంటికి రోడ్డు తప్ప ఎక్కడైనా రోడ్డు వేయించాడు నాలుగు సంవత్సరాలు నుండి బైపాస్ రోడ్డు నుండి అహోబిలం వరకు రోడ్డు వేయమంటే పలకరించే నాధుడే లేడని ఆయన అన్నాడు హైవే నుండి ఆళ్లగడ్డ కు రావాలన్న రోడ్లు లేవని ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు ఎంతోమంది ప్రమాదంలో చనిపోయినారని అన్నారు డ్రైనేజీ మురికి కాలువలు రోడ్ల పైన మురికి ప్రవహిస్తుందన్నారు సిరివెళ్ల చాగలమర్రి ఆళ్లగడ్డ ఎక్కడ చూసినా మురికి కంపు కొడుతుంది అన్నారు సిరివెళ్ల మండల కేంద్రంలో రోడ్లు లేవన్నారు ఏదో చేశామంటారు ఎక్కడ చేశారు చిన్న వర్షం కురిస్తే విష జ్వరాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేదన్నారు .ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని జగన్ మోహన్ రెడ్డి పోటీగా ఎమ్మెల్యే ప్యాలెస్ కట్టారని ఆయన అన్నారు ఎప్పుడు పెట్టంది ప్రెస్ మీట్ నారా లోకేష్ వచ్చిన తర్వాత పెట్టడం విచిత్రంగా ఉందన్నారు నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో శూన్యం అన్నారు ఇక్కడ ఏ అనారోగ్యం వచ్చిన గుండె నొప్పి వచ్చిన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందాన ఉందన్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలు ఏం చేస్తారో వారికే తెలుసునని కిషోర్ రెడ్డి తెలిపారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పరిపాలన సాగించాలని ఆయన హితవు పలికారు నంద్యాల జరిగిన సంఘటన ఏవి సుబ్బారెడ్డి పై దాడి జరగడం మంచి పరిణామం కాదని ఇలాంటివి ప్రజలు హర్షించరని పోలీసులు కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భూమాకిషోర్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో అంబటి మహేశ్వర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి నాగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
Bhuma Kishore: నాలుగేళ్ల సంబరాలేంటో? విచిత్రంగా ఉంది!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES