Sunday, September 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: బాబు మాటలు నమ్మేదెవరు?

Gangula: బాబు మాటలు నమ్మేదెవరు?

ఆళ్ళగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పట్టణ వాలేంటీర్లకు సేవావజ్ర,సేవారత్న,సేవా మిత్ర అవార్డులతో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి వాలంటీర్లను సన్మానించారు. ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు గంగుల రామిరెడ్డి కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి సింగం వెంకటేశ్వర్ రెడ్డి పడకండ్ల సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ శివ నాగిరెడ్డి కాంట్రాక్టర్ నజీర్ కౌన్సిలర్లు నరసింహులు ,బాలబ్బిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధులనీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీ సేవలు కొనియాడదగినవనీ ఇంకా మరింత చురుగ్గా ఉండి మీ స్థానిక నాయకుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలని వాలంటీర్లను ఎమ్మెల్యే గంగుల కోరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టాడని గతం లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు నేడు తిరిగి చేస్తాననడం ఎంతవరకు ప్రజలు నమ్ముతారని ఆయన చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. విద్యావంతులకు 3వేలు నిరుద్యోగ ఇస్తానంటున్నాడు గతంలో ఆళ్లగడ్డ పట్టణంలో వాళ్ల పార్టీ కార్యకర్తలకు పట్టుమని వంద మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వచ్చేది కాదని వైయస్సార్సీపీకి సంబంధించిన నవరత్నాలు కాపీ కొట్టాడని ఎమ్మెల్యే గంగుల అన్నారు. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా అన్ని ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే పరిపాలనగా సాగిస్తున్నారని ఆయన అన్నారు. నిత్యవసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ పెరిగిందని అంటున్నాడు కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది అన్నారు . అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటర్ లను సచివాలయం సిబ్బందిని కొంతలో కొంతైనా నిరుద్యోగ సమస్యను తీర్చింది జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్ బాబు వైఎస్సార్సీపీ దామోదర్ రెడ్డి ఎస్ఐ వెంకటరెడ్డి భాస్కర్ రెడ్డి నరసయ్య మున్సిపల్ సిబ్బంది బాలస్వామి వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News