నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్ళు పూర్తి చేసుకొని పదవ సంవత్సరoలోకి అడుగిడుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో సబ్భాండ వర్గాలు, సకల జనులు సంతోషంగా ఉన్నారన్నారు గుత్తా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపంలో లబ్ది జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిందని, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు ఆయన. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్న గుత్తా.. ఇప్పటికే లక్ష యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసాం మరో 50వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్న ఆయన.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశనికే ఆదర్శంగా నిలిచింది. కానీ ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు పగటి కలలు కంటున్నాయని, దేశ ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు గుత్తా. జూన్ 2వ తేదీ నుండి నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి.దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, కాంగ్రెస్ పార్టీ నేతలు అసూయతో రగిలి పోతున్నారు.అందుకే రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై కామెంట్స్ చేస్తున్నారు.కనీస విజ్ఞత లేకుండా ఉత్సవాలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో బి ఆర్ యస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు గుత్తా.