Friday, September 20, 2024
Homeహెల్త్Benefits of Coffee: కాఫీ పొడి పూసుకోండి..ఇక మెరివటమే తరువాయి

Benefits of Coffee: కాఫీ పొడి పూసుకోండి..ఇక మెరివటమే తరువాయి

కాఫీ పొడి ముఖానికి తెచ్చే అందం ఎంతో. కాఫీ పొడిని కింద చెప్పిన విధంగా ముఖానికి రాసుకుంటే మీవదనం కళకళలాడుతుంది.చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవడానికి కూడా కాఫీ పొడి బాగా పనికివస్తుంది. కాఫీ పొడి చర్మాన్ని ఎంతో కాంతివంతం చేస్తుంది కూడా. కాఫీలో ఫెనోల్స్ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్ నుంచి చర్మాన్ని పరిరక్షిస్తాయి. ఎందుకంటే ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం బాగా దెబ్బతింటుంది. కాఫీతో చేసిన ఫేస్ ప్యాక్ తో ఫ్రీరాడికల్స్ చర్మానికి కలిగించే హానిని తగ్గించవచ్చు. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ మెలడోనిన్స్ శరీరంలోని వాపును తగ్గిస్తాయి. అంతేకాదు చర్మంపై ఏర్పడ్డ మచ్చలు, దద్దుర్లు, యాక్నే, హైపర్ పిగ్మంటేషన్ లను కూడా ఇవి నివారిస్తాయి.
ముసలితనం చర్మంపై వేగంగా ప్రభావం చూపకుండా కూడా కాఫీ తోడ్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యాంటీ ఏజింగ్ ఏజెంటుగా కాఫీ పనిచేస్తుంది. అంతేకాదు కాఫీ పొడి యవ్వన కాంతితో మీ చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. వయసు మీదపడ్డట్టు తెలిపే ఏజ్ స్పాట్స్, ముడతలు, గీతల వంటి వాటిని కూడా కాఫీ పొడి పోగొడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండేలా కాఫీ పొడి పునరుద్ధరిస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను సైతం కాఫీ పొడి పోగొడుతుంది. కాఫీలో ఉండే కెఫైన్ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు అందేలా తోడ్పడుతుంది.
కాఫీ పొడితో మీ చర్మ అందానికి పనికివచ్చే కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో చెంచా పాలు వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై తలెత్తిన మచ్చలు పోతాయి. అలాగే ముఖంపై ఏర్పడ్డ గీతలు, ముడతలు కూడా మటుమాయ మవుతాయి.

- Advertisement -

zచ్ మార్కులున్న చోట దీన్ని రాసినా కూడా మంచి ఫలితాలు కనపడతాయి. ఇంకొక కిటుకు ఏమిటంటే కాఫీ పొడిలో కొద్దిగా పంచదార,నిమ్మరసం, తేనె, చెంచా ఆలివ్ నూనె వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖం, మెడ, చేతులపై రాసుకుని మ్రదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చర్మంపై చేరిన మ్రుతకణాలు పోయి చర్మం నునుపుదేలుతుంది. ట్యాన్ పోవాలంటే కూడా కాఫీ పొడి చిట్కా బాగా పనిచేస్తుంది. దీనికి రెండు చెంచాల కాఫీ పౌడర్ లో కొద్దిగా పెరుగు, చెంచా తేనె వేసి బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చర్మం
కూడా ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాదు రెండు చెంచాల కాఫీ పొడిలో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, నానబెట్టి బాగా రుబ్బిన బాదం గింజల మిశ్రమం, కొద్దిగా పాలు, రెండు చెంచాల శెనగపిండి వీటన్నంటిని కలిపి ఆ మిశ్రమంతో వంటికి నలుగుపెట్టుకుంటే చర్మం ఎంతో మెరుపును, మ్రుదుత్వాన్ని సంతరించుకుంటుంది.
కాంతివిహీనంగా ఉండే చర్మంపై గుమ్మడికాయ, కాఫీ పొడి కలిపి తయారుచేసిన ఫేస్ మాస్కు ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ రెండు పదార్థాలూ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కొల్లాజిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా చర్మం మ్రుదువుగా చేయడంలో సహకరిస్తాయి. ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్కు తయారుచేయడానికి మెత్తగా చేసిన అరకప్పు గుమ్మడి కాయ గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి కావాలి. అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి సమానంగా పూసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇంకో రకమైన ఫేస్ మాస్కు కూడా ఉంది. ఇందులో కాఫీ, పెరుగు రెండింటినీ చెరో రెండు రెండు టేబుల్ స్పూన్లతో పాటు అర టీస్పూను పసుపును కూడా తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఈ మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని జిడ్డుచర్మం, యాక్నే రిస్కు ఉన్న ముఖానికి పూసుకుని పదినిమిషాలు అలాగే ఉంచుకుని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లటి రంగుతో మిల మిల మెరుస్తుంది.

పసుపులో యాంటీ బాక్టీరియల్ సుగుణాలు బాగా ఉన్నాయి. ఇవి యాక్నేపై, మచ్చలపై శక్తివంతంగా పోరాడి వాటిని తగ్గిస్తాయి. పెరుగు చర్మంలోని అధిక నూనెను తొలగిస్తుంది. అంతేకాదు చర్మానికి కావలసినంత హైడ్రేషన్ ను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్ రాసుకున్న తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ కిటుకులు పాటించండి…మీ ముఖం మంచి వన్నెతో మెరిసేలా చేసుకోండి మరి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News