Friday, September 20, 2024
Homeహెల్త్Milky beauty: పాలమీగడతో అందమంతా మీ సొంతం

Milky beauty: పాలమీగడతో అందమంతా మీ సొంతం

మీగడతో మెరిసే మేను… పాలమీగడ ఆరోగ్యానికే కాదు అందానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పాలమీగడ వల్ల మేని ఛాయ రెట్టింపు అవుతుంది. మీగడలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందని బ్యూటీ నిపుణులు అంటారు. అంతేకాదు మీగడ చర్మం లోపలికంటా పోవడమే కాదు దెబ్బతిన్న కణాలను సైతం పునరుద్ధరిస్తుంది. మీగడలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి రాసుకుంటే ఎంతో మంచిది. మీగడలోని గుణాలు, తేనెలోని ఖనిజాలు ముఖాన్ని మెరిపిస్తాయి. చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.
మీగడలోని లాక్టిక్ యాసిడ్ చర్మం మీద చేరిన మలినాలను పోగొట్టి చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. ముఖం మీద ఏర్పడ్డ నల్లటి మచ్చల మీద మీగడ రాసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి అది పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీగడలోని ప్రొటీన్లు చర్మంపై చేరిన మ్రుతకణాలను తొలగిస్తాయి. అంతేకాదు మీగడలో కాస్తంత నిమ్మరసం కలిపి చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీగడను చర్మానికి నిత్యం రాసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చెర్, కాంప్లక్సెన్ ఎంతో బాగుంటాయి. చర్మం మరింత ఇనుమడించడానికి పాల మీగడతో చేసే ఫేస్ స్క్రబ్స్, ఫేస్ ప్యాకులను చాలామంది సెలబ్రిటీలు కూడా వాడుతుంటారు.
పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒకరకమైన ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. దీనిని పలు సౌందర్య ఉత్పత్తులలో కూడా వాడుతుంటారు. ఈ రకమైన కాస్మొటిక్స్ ఫార్ములేషన్స్ చర్మంపై ఏర్పడ్డ గీతలను పోగొడతాయి. చర్మం స్కిన్ టోన్ ను ఎంతో మెరుగుపరుస్తాయి. చర్మం కండిషన్ బాగా ఉండేలా తోడ్పడతాయి. చర్మ రంధ్రాలు మూసుకు పోకుండా గాలి బాగా సోకేలా చేస్తాయి. పైగా లాక్టిక్ యాసిడ్ చర్మంపై శక్తివంతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మం లోపలి పొరల కంటా దీని ప్రభావం ఉంటుందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. అంతేకాదు బ్యూటీ ఉత్పత్తుల్లో ఉపయోగించే మలై వల్ల చర్మం పొరలు తగినంత దళసరితనంతో ఉంటాయి. అంతేకాదు చర్మం బిగువుగా ఉండేలా సంరక్షిస్తాయి కూడా.
పాలమీగడను చర్మానికి రాసుకోవడం వల్ల మ్రుతకణాలు పోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి. పాలమీగడ రాసుకోవడం వల్ల చర్మం ఎంతో యంగ్ గా కనిపిస్తుంది. అంతేకాదు వయసు మీద పడినట్టు కనిపించరు. అలాగే పాలమీగడను చర్మానికి రాసుకోవడం వల్ల హైడ్రేషన్ బాగుంటుంది. మీగడ మీ మోముకు సిల్కీ అందాలను తెస్తుంది. ముఖం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. మీ చర్మం ఎలాస్టిసిటీని, బిగువును కోల్పోతుందన్నట్టు అనిపిస్తే మీగడ రాసుకుంటే అది మీ చర్మ సౌందర్యాన్ని సంపూర్ణంగా కాపాడుతుందంటున్నారు . అంతేకాదు చర్మం బిగువుగా స్కిన్ టెక్సెర్ సైతం బాగా మెరుగవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News