చర్మం ముడతలు పడకుండా చేసే ఫుడ్స్ …
ముఖంపై ముడతలు పడకుండా ఉండాలన్నా, చర్మంపై ఉన్న ముడతలు తగ్గాలన్నా ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన డైట్ తీసుకునే వారిలో చర్మం కూడా ఎంతో అందంగా, మరింత ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా వీరిలో వ్రుద్ధాప్యపు ఛాయలు తొందరగా తలెత్తవని పోషకాహార నిపుణులు సైతం పేర్కొనడం మనం వింటుంటాం. ఆరోగ్యకరమైన ఆహారం తింటే చర్మం కాంతివంతంగా ఉంటుందంటారు. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ గురించి చెప్పాలంటే వాటిల్లో మొదటిది అవకెడో. దీన్ని తింటే అందమైన, ఆరోగ్యవంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
అవకెడోలో విటమిన్ ఇ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ఈ పండులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావలసింత మాయిశ్చరైజర్ అందివ్వడమే కాదు చర్మన్ని మ్రుదువుగా, పట్టులా చేస్తాయి. చర్మాన్ని మెరిపించే మరో ఫుడ్ గ్రీన్ టీ. ఇది బరువు తగ్గించడంలో కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ ముఖంపై, మెడపై ఉండే చర్మం ముడతలు పడకుండా దీర్ఘకాలంపాటు నిరోధిస్తుంది.
యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కెటాచిన్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టీ బ్యాగును వేడి నీళ్లల్లో కాసేపు ఉంచి, తర్వత తీసి ఆ నీళ్లను తాగితే చర్మానికి ఎంతో మంచిది. సోయాబీన్స్ కూడా చర్మ రక్షణలో ఎంతో తోడ్పడతాయి. వీటిల్లో ప్రొటీన్లు, అమినో ఆమ్లాలు ఎక్కువ. అంతేకాదు ముడతలు పడకుండా చేసే సోఫ్లవోన్స్ కూడా వీటిల్లో ఉన్నాయి. ఇవి చర్మం ఎలాస్టిసిటీని సంరక్షించడమే కాకుండా ముడతలు కనపడకుండా నిరోధిస్తాయి. బ్లూబెర్రీస్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ.
వీటిల్లోని యాంథోసియనిన్స్ ఫ్రీరాడికల్స్ నుంచి విముక్తి కలిగించడమే కాదు టిష్యూలను దెబ్బతీసే ఎంజైములను తటస్థీకరించడంలో కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. బ్లూబెర్రీస్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎంతో బాగా సంరక్షిస్తుంది. క్యారెట్లు కళ్లకు ఎంతో మంచిదని చాలామందికి తెలుసు. కానీ చర్మానికి కూడా ఇవి ఎంతో మంచివని తెలిసిన వారు ఎంతమంది? వీటిల్లో బెటాకెరొటెనె అధికంగా ఉంటుంది. ఇవి సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. పైగా క్యారెట్లల్లో విటమిన్ సితో పాటు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే పలు పోషకాలు కూడా ఉన్నాయి. చర్మం ప్రకాశవంతంగా ఉండాలంటే టొమాటోలు కూడా బాగా తినాలి. వీటిని తినడం వల్ల చర్మం ముడతలు పడదు . ముఖాన్ని కాంతివంతంగా కనిపించేట్టు చేసే లైకోపెనె వంటి పలు కాంపౌండ్లు టొమాటోల్లో ఎన్నో ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను చంపేయడం ద్వారా అతినీలలోహిత కిరణాల వల్ల తలెత్తే దుష్ప్రభావాలను ఎంతో శక్తివంతంగా తటస్థీకరిస్తుంది. టొమాటోల్లో విటమిన్ సి తో
పాటుగా బెటా కెరొటెనె కూడా ఉంది. ఇవి రెండూ చర్మం టెక్స్చెర్ ను మరింతగా మెరిపిస్తాయి. రోజుకు కనీసం ఐదు టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూసులో ఐదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి తాగితే సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని 33 శాతం దాకా పరిరక్షిస్తుంది.
చాకెలేట్స్ కూడా చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తాయి. ఇందులోని కోకో చర్మాన్నికి కావలసినంత హైడ్రేషన్ ని అందిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగువుగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. అందుకే డార్కు చాక్లెట్ తినమంటారు. ఎందుకంటే డార్కు చాక్లెట్ లో అధికమొత్తంలో ఫ్లవొనోల్స్ ఉన్నాయి. అంతేకాదు కళ్ల కింద ఏర్పడే వాపు వంటి సమస్యలను కూడా చాక్లట్ తగ్గిస్తుంది. కళ్ల కింద చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే నట్స్ తింటే కూడా అందమైన, ఆరోగ్యమైన చర్మం మీ సొంతం అవుతుంది. నట్స్ లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కాంపౌండ్స్ చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ని అందించడమే కాకుండా వాపును కూడా నిరోధిస్తాయి.
ఇకపోతే పెరుగు కూడా చర్మ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగులోని ప్రొబయొటిక్స్ శరీరానికి మంచి చేయడమే కాకుండా చర్మంపై ఇన్ఫెక్షన్లు, ఎలర్జీల వల్ల ఏర్పడే దద్దుర్లు, ఇరిటేషన్ ను తగ్గిస్తాయి. పులయబెబట్టిన పాలు చర్మానికి ఎంతో మంచి చేస్తాయి. అంతేకాదు మీ చర్మంతో పాటు జుట్టును కూడా కండిషన్లో ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడే మరో ఆహార పదార్థం తేనె. ఇందులో యాంటాక్సిడెంట్లు సమ్రుద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి వ్రుద్ధాప్యం మీద పడకుండా జాప్యం చేయడంలో ఎంతో సహకరిస్తాయి. మీరు తీసుకునే డైట్ లో తేనెను కూడా చేర్చవచ్చు. దీన్ని ఫేస్ మాస్కుగా కూడా ఉపయోగించవచ్చు. పైన పేర్కొన్న రెండు రకాలుగా తేనె స్కిన్ అందం, ఆరోగ్యం పరంగా అద్భుతాలు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. చేపలు కూడా చర్మ సౌందర్యానికి ఎంతో మంచివి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచివి. చేపలోని ఫ్యాట్ చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ని అందిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సార్డినె, సాల్మన్ చేపల్లో పుష్కలంగా ఉంటాయి. మనం నిత్యం వాడే ఉల్లిపాయలు కూడా చర్మం ముడతలు పడకుండా సంరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిల్లో క్వెర్సెటిన్ అనే పోషకం ఉంది. ఇది చర్మం ముడతలు పడకుండా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఉల్లిపాయల్లో సల్ఫర్, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మ్రుదువుగా, పట్టులా ఉండేలా సహాయపడతాయి. ఉల్లిపాయల్లో చర్మం ముడతలు పడకుండా తోడ్పడే పలు సుగుణాలు ఉండడంతో పాటు శరీర ఆరోగ్యానికి సహకరించే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తోటకూర కూడా చర్మం ముడతలు పడకుండా ఎంతో కాపాడుతుంది. అలాగే రోజుకు ఒక యాపిల్ తింటే మీ చర్మం తొందరగా ముడతలు పడదంటున్నారు బ్యూటీనిపుణులు. యాపిల్స్ లో విటమిన్ సితో పాటు క్వెర్సెటిన్ కూడా ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ యాంటాక్సిడెంట్ ఫ్రీరాడకల్స్ ను నశింపచేస్తాయి. యాపిల్ ముడతలను నిరోధించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
పాలకూర కూడా చర్మాన్ని మెరిసేలా చేయడమే కాదు ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, బెటా కెరొటెనె, గ్రుటాథియోన్, కొయిన్జైమ్ క్యూ 10 వంటి కాంపౌండ్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యమైన చర్మం, ద్రుఢమైన శిరోజాలు కావాలనుకునే వారికి గొప్ప వరాల వంటివని పోషకాహారనిపుణులు చెప్తారు. మరి ఈ ఫుడ్స్ ని మీ డైట్ నిత్యం చేర్చడం ద్వారా ముడతలు లేని అందమైన, ఆరోగ్యమైన చర్మ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి…