Saturday, September 21, 2024
HomeతెలంగాణRamadugu: ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Ramadugu: ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రామడుగు మండల కేంద్రంలో 20 లక్షల నిధులతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం, సిసి రోడ్ అభివృద్ధి కార్యక్రమాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచి నీటిని అందిస్తున్నామని అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు.

- Advertisement -

పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News