పేదరికంతో అల్లాడుతూ పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కొత్త దాంరాజు పల్లి గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పెద్దలు అండగా నిలిచారు. కొత్త దామరాజు పల్లి గ్రామానికి చెందిన ఇల్లెందుల రాజేశం పెద్ద కుమార్తె రాజేశ్వరి పెళ్లి ఖర్చుల కోసం పదివేల ఒక వంద పదహారు రూపాయలను పెళ్లికూతురు తల్లికి గ్రామ పెద్దలు అందజేశారు. తమ కూతురు వివాహానికి గ్రామ పెద్దలు అండగా నిలవడం పట్ల గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవా సమితి సభ్యులు ఏలేటి లింగారెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, మామిడల రాకేష్, కాచర్ల రాజేందర్ లు పాల్గొన్నారు.