Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుChevella: గంజాయి @ కొబ్బరి బోండాలు

Chevella: గంజాయి @ కొబ్బరి బోండాలు

పోలీసుల కళ్ళు కప్పి బాహ్య ప్రపంచానికి చెప్పేది కొబ్బరి బొండాల రవాణా చేసేది గంజాయ సరఫరా. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటి పోలీసులు శంకర్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 54 లక్షల విలువ చేసే 228 కిలోల గంజాయి ఒక బోలేరో వాహనం మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ డివిజన్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మహారాష్ట్రకు చెందిన సమీర్‌ ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని కోనుగోలు చేసి వివిధ మార్గాల గూండ మహారాష్ట్రకు తరలిస్తుంటాడు. ఇతడిపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రాలలో పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితుడిపై పోలీసు నిఘా అధికంగా ఉండడంతో గత కొన్ని నెలలుగా మధ్యవర్తులను ఎంపిక చేసుకోని గంజాయి రవాణా చేస్తున్నాడన్నారు. ఇందు కోసం ఒకసారి ఉపయోగించిన వ్యక్తులను మరోసారి ఉపయోగించకుండా వారికి వేలాధి రూపాయలు ఇస్తూ పోలీసులకు చిక్కకుండా రవాణా కోనసాగిస్తున్నరన్నారు.రాజమండ్రి నుంచి బుధవారం బోలేరో వాహనంలో పెద్ద ఎత్తున గంజాయి వస్తున్నట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటి ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. ఔటర్‌తో పాటు మోకిల శంకర్‌పల్లి ప్రాంతాల్లో రాత్రి నుంచి కాపుకాశారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బోలేరో వాహనంలో కొబ్బరి బొండాలను నింపుకోని మహారాష్ట్ర అమరావతికి చెందిన సయ్యద్‌ ఖాన్‌ షరీఫ్‌ ఖాన్‌(41), మహారాష్ట్ర అకోలా ప్రాంతానికి చెందిన మారుతీ సుజికి షోరూమ్‌ సూపర్‌వైజర్‌ మహ్మద్‌ ఆదీల్‌(21)లు వెళ్తున్నారు. అనుమానంపై పోలీసులు ఆపి తనిఖీ చేయగా కొబ్బరి బొండాల మధ్యలో రెండు కిలోల చోప్పు ప్యాక్‌ చేసిన 114 గంజాయి ప్యాకెట్లు లభ్యమైయ్యాయి. ఈ గంజాయి ప్యాకెట్లను నిందితులు కొబ్బరిబొండా గుత్తులో కనిపించని విధంగా ప్యాక్‌ చేయడం గమనార్హం. పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్‌లు బోలేరో వాహనం 228 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ప్రధాన నిందితుడు సమీర్‌ రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు వాహనాన్ని తీసుకువచ్చి ఇస్తే 25 వేల రూపాయలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. డబ్బు ఆశతో నిందితులు గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఎస్‌ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News