మానుకోట తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పాదాభివందనాలతో, పులదండలతో ఘన సన్మానం చేశారు తెలంగాణ రాష్ట్ర ఆదివాసి ఛైర్మన్, TPCC సీనియర్ అధికార ప్రతినిధి DR. బెల్లయ్య నాయక్. రెడ్యానాయక్, మలోత్ కవితలపై ఆయన మండిపడ్డారు. అమ్మ కవిత (ఆనాటి ఎమ్మెల్యే) మీ తుపాకీలో నుంచే కదా ఈ ఉద్యమకారులకు బుల్లెట్ లు తగిలాయి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు జరుపుకోవడం కాదు దమ్ముంటే ఉద్యమకారులను ఆదుకోండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కొట్లడిన ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదని అన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామన్నారు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను గుర్తించి మరి రానున్న రోజుల్లో ఆదుకుంటామన్నారు.
మహబూబాబాద్ లోని టీపీసీసీ ఆదివాసీ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 13 సంవత్సరాల క్రితం, రాళ్ల వర్షం కురిపించిన ఉద్యమకారులు, బల్లెట్లన్ని సైతం లెక్క చేయ్యకుండా ఉద్యమించిన 9 మంది ఉద్యమకారులకు మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున శాలువాతో సత్కరించి సన్మానం కార్యక్రమం నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి గుగిళ్ళ పీరయ్య, ఎల్. హెచ్.పీ.ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరి నాయక్, ఎస్టీ.సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ నాయక్, ఎల్.హెచ్.పీ.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమా నాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తిపర్తి శ్రీధర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు జన్నారెడ్డి పద్మజా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పోతురాజు రాజు, OBC పట్టణ అధ్యక్షులు లింగాల వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ రెడ్డి, మేకల శివ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.