కనీస వేతనల సలహా మండలి చైర్మన్ గా చేవెళ్ల మండలం నాంచెరి గ్రామానికి చెందిన పులిమామిడి నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఆర్టీసీ కళాభవన్ లో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… తమపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గత పదమూడు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినందుకు పార్టీ తమను గుర్తించిందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తను బిఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుందనారు. ఒక కార్యకర్త గా పార్టీలో చేరిన నేనే దీనికి ప్రతిబింబం అన్నారు.తమపై నమ్మకంతో ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు తమ కర్తవ్యాన్ని అంకిత భావంతో నిర్వహిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, మండల ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నారాయణను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం ఇచ్చి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.