రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ త్లలి చిత్ర పటానికి పూమాలలు వేసి, అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ టి రాజయ్య, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జెడ్పీ టీసీలు, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, వివిధ శాఖల అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. జిల్లాలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అభివృద్ధిని వివరించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ జిల్లా బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ త్లలి విగ్రహానికి, చాకలి అయిలమ్మ, శ్రీకాంత చారి తదితర అమర వీరుల విగ్రహాలను నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.