వంటింటి చిట్కాలు
బాగా పండిన టొమాటోలను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికి తాజాగా తయారవుతాయి.
వెల్లుల్లి రెబ్బలను నీటిలో గంటసేపు నానబెడితే వాటిపై పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో పెడితే మెత్తబడవు.
కూరగాయముక్కలను పసుపునీటిటో ఉంచితే వాటిల్లోని సూక్ష్మక్రిములు నశిస్తాయి.
కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే పురుగుపట్టదు.
వర్షాలలో బట్టలు వాసన రాకుండా ఉండాలంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్లల్లో కొంత నిమ్మరసం కలిపి అందులో దుస్తులను ముంచి ఆరేయాలి. ఇలా చేస్తే బట్టల నుంచి దుర్వాసన రాదు.
గ్రేవీ చిక్కగా రావాలంటే కొద్దిగా కొబ్బరిపాలు లేదా బాగా గిలక్కొట్టిన పెరుగు కలపాలి.
వంటింట్లో పెట్టే చెత్తడబ్బా నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి వాడేసిన టీపొడి లేదా రెండు టీ శాచెట్స్ ను అందులో వేయాలి.
నీళ్ల కుళాయిలపై పడిన మచ్చలను నిమ్మ చెక్కతో రుద్దితే పోతాయి.
పప్పు బాగా ఉడికి రుచిగా ఉండాలంటే అందులో ఒక టీ స్పూను నువ్వుల నూనె వేయాలి.