Thursday, September 19, 2024
HomeతెలంగాణKamareddy: రాష్ట్రావతరణ వేడుకల్లో పోచారం

Kamareddy: రాష్ట్రావతరణ వేడుకల్లో పోచారం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ముందుగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజుల సురేందర్, హన్మంత్ షిండే, ZP చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా SP బి శ్రీనివాస రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నత అధికారులు.

- Advertisement -

ఈసందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం వేదికపై నుండి కామారెడ్డి జిల్లా అభివృద్ధిని వివరించారు.. తల్లిపాల ప్రోత్సాహకంలో బాన్సువాడ మాతా-శిశు ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందని, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి అయిదోసారి “కాయకల్ప” అవార్డు వచ్చిందన్నారు పోచారం. ఎంత విమర్శలు చేసినా జరుగుతున్న అభివృద్ధిని ఎవ్వరూ దాచలేరని, దేశంలోని 20 ఉత్తమ గ్రామ పంచాయతీ లలో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవనని ఆయన పేర్కొన్నారు. ఓర్వలేక, మతిలేక కొంతమంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారని ..వారి విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళుతామన్నారు పోచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News