హిందూ ముస్లింల మతసామరస్యానికి ప్రతికగా మండల కేంద్రమైన మండల కేంద్రమైన కౌతాళంలో ఖాదర్ లింగ స్వామి స్వామి 319 ఉరుసు ఉత్సవాలు అశేష భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగాయి… ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం తరలివచ్చారు… దర్గా పీఠాధిపతుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున స్వామి గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.. అనంతరం భక్తులు మేళతాళాలతో తరలివచ్చి, స్వామికి నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు.. ఉరుసు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.. ఆయా ప్రాంతాల నుండి ఫకీర్ సాహెబ్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి… స్వామి నామస్మరణతో కౌతాళం పులకించింది… భక్తుల సౌకర్యార్థం ఆంధ్ర కర్ణాటక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసి సిఐ ఎరిషావలి, కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉరుసుకు వచ్చే వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని దర్గా పీఠాధిపతి పెద్దమున్న సాహెబ్ తెలిపారు… ఉరుసు వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….