Friday, November 22, 2024
HomeతెలంగాణNanpur: ఆర్కే-7 గని ఆవరణలో రాష్ట్రావతరణ వేడుకలు

Nanpur: ఆర్కే-7 గని ఆవరణలో రాష్ట్రావతరణ వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఫిట్ సెక్రెటరీ మేండే వెంకటి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మిక నేతలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపాఠాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు, గని మేనేజర్ సాయి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే-7 ఫిట్ సెక్రెటరీ మేండే వెంకటి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఈ రోజు ఇంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెచ్చుకున్న రాష్ట్రంలో రథసారధిగా అనేక అభివృద్ధి -సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు చేశారని గత ప్రభుత్వాలు పోగొట్టిన కారుణ్య నియామకాల పద్ధతిని మరల ప్రారంభించి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ వేడుకలకు మహిళా ఉద్యోగులు బతుకమ్మలతో వచ్చి ఆటపాటలతో వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఏరియా సెక్రెటరీ అశోక్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రౌతు సత్యనారయణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ ప్రేమ్ కుమార్, షిఫ్ట్ సెక్రటరీలు మోహన్, బుచ్చన్న, ప్రతాప్, జనరల్ మజూర్, బదిలీ వర్కర్ ఇన్చార్జ్ అఖిల్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రణయ్, టీబీజీకేఎస్ నాయకులు రాజు నాయక్, తాటి రవీందర్, మల్లేష్, వెంకన్న, బద్రి శ్రావణ్ కుమార్, పాదం శ్రీనివాస్, రంగు రాజశేఖర్ గౌడ్, అజీజ్, దార వంశీకృష్ణ, గోవిందల మల్లేష్, కుమార్, సారంగపాణి, సతీష్, శ్రీధర్, లక్ష్మణ్, ఓవర్ మాన్ శ్రావణ్, మల్లేష్, మేండే మహేష్, శ్రీనివాస్, మహేందర్, విష్ణు, కటికం మహేష్, నాగయ్య, మేకల రమేష్, కత్తి రాకేష్, ముత్యం రాకేష్, శ్రీధర్, రాజు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News