Sunday, June 22, 2025
HomeతెలంగాణKhammam: కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Khammam: కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం క్యాంప్ కార్యాలయంలో సాంస్కృతిక కళా ప్రదర్శన నిర్వహించారు. కళా ప్రదర్శనలో ఎమ్మెల్యే రాములు నాయక్ కోలాటమాడి కార్యకర్తలను ఆనందపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఉత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి దశాబ్ది ఉత్సవాలను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 20 రోజులు పాటు జరిపించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News