తెలుగుదేశం పార్టీ కార్యాలయం పట్టణ పార్టీ కన్వీనర్ మల్లాది హనుమంతరావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి, అమరవీరుల స్థూపంవద్ద నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం విచ్చేసి పార్టీ కార్యాలయంపై జాతీయ జెండాను, పార్టీ జెండాను ఎగురవేసి జాతీయ నాయకులకు, తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కులమత వర్గాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, రాస్తారొకో, రైల్ రొకో, సకల జనుల సమ్మె లాంటి అనేక పోరాటాలు చేసారని, శ్రీకాంతాచారి లాంటి కొందరు ఉద్యమంలో ఆత్మార్పణ కావించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులు ముఖ్యంగా ఐటి రంగంలో గణనీయంగా వుందని, సంత్సరానికి 2 లక్షలకోట్ల ఐటీ ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుందని, చంద్రబాబు హయాంలోనే ఐటి రంగం పునాదులుపడి నేడు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, మధిర రూరల్ మండల అధ్యక్షుడు మార్నీడి పుల్లారావు, కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, నాయకులు వేమూరి సునీల్, గద్దల ప్రకాశరావు, ఏసోబు, మేడా వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ఈశ్వరరావు, నాగభైరవ చౌదరి, బోణాల ప్రసాదు, కృష్ణ తదితరులు పాల్గన్నారు.